వైరల్ వీడియో: ఈ బుల్లి ఎలుగుబంటి అల్లరి మాములుగా లేదుగా

సాధారణంగా మనం జూలోకి వెళ్తే అనేక రకాల జంతువులను సందర్శించవచ్చు.ఇక ముఖ్యంగా చిన్నపిల్లలు జూకు వెళ్లి సరదాగా గడపడానికి ఎంతో ఇష్టం చూపిస్తూ ఉంటారు.

 Viral Video: This Bully Bear's Mischief Is Not Uncommon, Junjun ,viral Bear ,cu-TeluguStop.com

ఇక జంగల్ సఫారీలో (jungle safari)అయితే అనేక రకాల జంతువులను చాలా దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది.కానీ, ఒక ప్రాంతంలో సంవత్సరం వయసున్న ఒక బుల్లి ఎలుగుబంటి జుంజున్(Junjun the Bully Bear) అందరినీ ఆకట్టుకోవడంతోపాటు ఆశ్చర్యాన్ని కలగ చేస్తుంది.

సోషల్ మీడియా వేదికగా జుంజున్ కు సంబంధించిన వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.జుంజున్ తన ఇష్టమైన బొమ్మ పాత టైర్ తో ఆడుకోవడం నీటిలో సరదాగా గడపడం చాలా మందికి ఆకట్టుకుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ కావడంతో నెటిజన్స్ నుంచి వివిధ రకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలోకి వెళ్తే.చైనాలోని షాంఘై జూలో జుంజున్ అనే బేబీ ఎలుగుబంటి అందరికీ ఎంతగానో ఇష్టతరంగా మారింది.సంవత్సరం వయసు ఉన్న ఈ చిన్న ఎలుగుబంటి చేసే సరదా పనులు అందరినీ ఆకట్టుకుంది.

నిజానికి ఈ జుంజున్ అచ్చం కుక్క పిల్ల లాగా కనపడుతుంది.ఇది 1 మీటరు పొడవు, 35 కిలోగ్రాముల బరువు ఉంది.ఎవరైనా కానీ సడన్ గా దీన్ని చూస్తే ఇది బ్రౌన్ ఎలుగుబంటి అని అనుకోరు అది అచ్చం కుక్క పిల్లల ఉంది అని అనుకుంటారు.ఇక సాధారణంగా జనవరి నెలలో చలికి జూకి ఎవరు ఎక్కువగా రారు.

కానీ, ఈ జుంజున్ తన ఎంపిక చేసిన సందర్శకులను ఆకర్షించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంది.దాంతో బుల్లి ఎలుగుబంటి జూలో పెద్ద స్టార్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube