మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగి పోవడం.ప్రతి మహిళా తన జీవితంలో ఎదుర్కొనే ఓ దశ.
ఈ మెనోపాజ్ దశలో స్త్రీలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు.గుండె దడ, నీరసం, ఉన్నట్టుండి ఒళ్లంతా మంటలూ, ఒత్తిడి, చీటికీ, మాటికీ చిరాకు రావడం, కారణం లేకపోయినా ఏడవటం, అధిక కోపం, ఇరిటేషన్, మతి మరుపు, జుట్టు రాలటం, తల నొప్పి, నిద్ర పట్టక పోవటం, చర్మం నిగారింపు కోల్పోవడం ఇలా ఆ దశలో బోలెడన్ని సమస్యలను ఫేస్ చేస్తుంటారు.
అలాగే మెనోపాజ్ దశలో చాలా మంది మహిళలు బరువు కూడా భారీగా పెరుగుతుంటారు.అయితే ఆ సమయంలో ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను పాటిస్తే సులభంగా పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
సాధారణంగా చాలా మంది మహిళలు మెనోపాజ్ దశలో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.
ఆ ఒత్తిడి వల్ల సరిగ్గా నిద్ర పట్టదు.ఫలితంగా బరువు పెరుగుతారు.
అందు వల్లనే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.అందుకోసం రోజూ యోగా, ధ్యానం వంటివి చేయాలి.
అలాగే మెనోపాజ్ దశలో మహిళలు సరిగ్గా ఆహారం తీసుకోరు.అందు వల్ల కూడా బరువు పెరుగుతారు.
అందుకే డైట్‌లో తాజా కూరగాయలు, ఆకుకూరలు, సీజనల్ పండ్లు, నట్స్, పాలు, గుడ్లు, తృణ ధాన్యాలు వంటి పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.
మెనోపాజ్ దశలో వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి.రోజుకు ఇరవై నిమిషాల పాటు వ్యాయామాలు చేస్తే బరువు తగ్గుతారు.కండరాలు దృఢంగా మారతాయి.
నిద్ర బాగా పడుతుంది.మరియు ఇతర అనారోగ్య సమస్యలు సైతం తగ్గు ముఖం పడతాయి.
మెనోపాజ్ దశలో ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి అవసరమనుకుంటే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, బ్యాలెన్సింగ్ థెరపీ వంటి చికిత్సలు తీసుకోవాలి.ఇవి కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
ఇక మెనోపాజ్ దశలో వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.బయట ఆహారాలకు దూరంగా ఉండాలి.
మరియు స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చెడు అలవాట్లను నివారించుకోవాలి.తద్వారా బరువు అదుపులోకి వస్తుంది.