బట్టతలతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే!!

బ‌ట్ట‌త‌ల.ఈ పేరు వింటేనే అబ్బాయిలు వ‌ణికిపోతారు.పట్టుమని పాతికేళ్ళయినా నిండకుండా బ‌ట్ట‌త‌ల వ‌చ్చిందంటే.ఇక వారి బాధ అంతా ఇంతా కాదు.అయితే ఇటీవ‌ల కాలంలో బట్టతల బాధితులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నారు.వీరిని చూసి జుట్టు రాలే బాధితులు తమకు కూడా ఎక్కడా బట్టతల వస్తుందోనని ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు.

 How To Get Rid Of Baldness??, Baldness, Beauty Tips, Latest News, Beauty, Hair C-TeluguStop.com

ఎందుకంటే.జుట్టు రాలడం బట్టతలకి కారణమవుతుంది.
వాస్త‌వానికి పోషకాహార లోపం, కాలుష్యం, వంశపారంపర్య కారణాలు, తీవ్రమైన ఒత్తిడి, కొన్ని రకాల మందులు తదితర కారణాల వ‌ల్ల బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.అయితే తలపై వెంట్రుకలు లేనంత మాత్రాన చింతించాల్సిన అవ‌స‌రం లేదు.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.ఖ‌చ్చితంగా హెయిర్ రీగ్రోత్ అవుతుంది.

ముందుగా, కొత్తిమీరను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి రసం తీసి బట్టతల ప్రదేశంలో అప్లై చేయాలి.

Telugu Baldness, Tips, Care, Latest-

ప్ర‌తి రోజు ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌ళ్లీ హెయిర్ వ‌స్తుంది.బట్టతలను నివారించడంలో బ్లాక్ పెప్పర్ లేదా మిరియాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మిరియాలు మెత్తగా పేస్ట్ చేసి తలకు ప‌ట్టించాలి.

అరగంట పాటు ఆరిన‌ తర్వాత తలస్నానం చేయాలి.ఇలా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే బట్టతలను నివారించడంలో ఉసిరికాయ గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.క‌నుక‌, ఉసిరికాయ‌ల ర‌సం తీసుకుని.అందులో నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి బ‌ట్ట‌త‌ల ప్రాంతంలో బాగా అప్లై చేయాలి.ప్ర‌తి రోజు ఇలా చేయ‌డం వ‌ల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది.

ఇక బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నుకునే వారు ధూమపానం అలవాటు పూర్తిగా మానేయాలి.ఎందుకంటే.

ఇందులో ఉండే నికోటిన్ రక్తనాళాన్ని కుదిస్తుంది.జుట్టు పెరగకుండా నిరోధిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube