హిమోగ్లోబిన్( Haemoglobin ) అనేది రక్తంలోని ఎర్ర రక్తకణాల్లో ఉండే ఒక ప్రోటీన్.ఇది ఇనుము ఆధారిత మాలిక్యూల్.
ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు తరలించడమే హిమోగ్లోబిన్ పని.హిమోగ్లోబిన్ వల్లే రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది.
ఐరన్, విటమిన్ బి12 కొరత, గర్భధారణ సమయంలో పోషకాహార లోపం, రక్తహీనత, అంతర్గత రక్తస్రావం, క్రొత్తగా రక్తం తయారయ్యే ప్రక్రియ లోపించటం తదితర కారణాల వల్ల ఒక్కోసారి శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ అనేవి తగ్గుతుంటాయి.ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవల్స్ తగ్గుతాయో.
అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ముఖ్యంగా తీవ్రమైన అలసట, నీరసం,( Fatigue ) తల తిరుగుట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండెదడ, తలపోటు, చేతులు, కాళ్లు చల్లగా మారిపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.అయితే శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను సహజంగా పెంచడంలో కొన్ని రకాల పండ్లు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి.ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది.
ఉసిరి.( Amla ) దీనిలో విటమిన్ సి మెండుగా ఉంది.ఇది శరీరంలో ఇనుము శోషణను పెంచుతుంది.హిమోగ్లోబిన్ లెవల్స్ ను ఇంఫ్రూవ్ చేస్తుంది.

అలాగే దానిమ్మలో( Pomegranate ) ఇనుము, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.అందువల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచడంలో దానిమ్మ పండు అద్భుతంగా తోడ్పడుతుంది.సహజమైన చక్కెరతో పాటు ఇనుము కూడా అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుకునేందుకు మీరు ఖర్జూరం పండ్లను కూడా తినొచ్చు.
అరటి పండు ఫోలిక్ యాసిడ్ మరియు ఇనుముకు మంచి మూలం.
రోజుకొక అరటిపండును తింటే శరీరానికి తక్షణ శక్తి చేకూరడంతో పాటు బాడీలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.ఇవే కాకుండా బ్లాక్ గ్రేప్స్, ఆపిల్, ఆరెంజ్, మ్యాంగో వంటి పండ్లు కూడా హిమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుకోవడానికి మంచి ఆప్షన్ అవుతాయి.