ప్రస్తుత సమాజంలోని ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలలో ఒత్తిడి సర్వసాధారణంగా మారిపోయింది.జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల చాలామంది ప్రజలు ఒత్తిడి( Stress )కి గురవుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మనసును ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.ధ్యానం, యోగా వంటివి చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు ఎప్పుడైనా తీవ్ర ఒత్తిడికి గురైతే ఒక పది నిమిషాలు ధ్యానం చేసి చూడండి తేడా మీకే కనిపిస్తుంది.
మెదడుకు రిలాక్సేషన్ ఇచ్చే ఏకాక సాధనం ధ్యానం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అందుకే మన పూర్వీకులు ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నారు.ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనం ధ్యానం కోసం కొన్ని నిమిషాల సమయం వేచించడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.బీపీ, హార్ట్ రేట్( Heart rate ), గ్లూకోస్ లెవెల్స్ అన్నిటిని నియంత్రించే శక్తి ధ్యానానికి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
శ్వాస వ్యాయమాలలో నిమగ్నమైనప్పుడు అయినప్పుడు వారి ఒత్తిడి తగ్గి హార్ట్ రేట్ నార్మల్ గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఏకాగ్రతతో కొద్దిసేపు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఒత్తిడికి గురయ్యేవారు, కార్టిసోల్, డొపమైన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది.

అలాగే శ్వాస వ్యాయామాలను( Breathing Exercises ) తరచుగా చేయడం వల్ల మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ముందుగా ప్రశాంతమైన సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి.ప్రారంభ దశలో చాతి నుంచి మొదలుకొని పొత్తికడుపు వరకు వీలైనంత లోతుగా గాలి పీల్చుకొని నేమ్మదిగా వదులుతూ ఉండాలి.
ఈ పద్ధతిని మీకు వీలైనన్ని సార్లు పది నుంచి 20 నిమిషాల వరకు చేస్తూ ఉండాలి.గట్టిగా శ్వాస పీల్చడం కొన్ని సెకండ్లు పాటు నిలిపి ఉంచడం, ఆ తర్వాత వదిలేయడం వల్ల డీప్ బ్రీతింగ్ టెక్నిక్ స్ట్రెస్ నుంచి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.