ఈ మధ్యకాలంలో చాలా మందిని తెల్ల జుట్టు( White Hair ) సమస్య అనేది బాగా ఇబ్బంది పెడుతుంది.వయసు పైబడిన వారే కాకుండా వయసులో ఉన్న వారు కూడా తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.
అయితే వైట్ హెయిర్ వచ్చాక కలర్స్ వేసుకుంటూ బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ మాస్క్ నెలకు రెండు సార్లు వేసుకుంటే తెల్ల జుట్టు మీ వంక కూడా చూడదు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక అందులో ఐదు నుంచి ఆరు మందారం పువ్వులు( Hibiscus ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్,( Tea Powder ) గుప్పెడు పుదీనా ఆకులు( Mint ) వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించండి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాలు లేదా గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.నెలకు రెండుసార్లు ఈ హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే మీరు ఆశ్చర్యపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

ఈ మాస్క్ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.జుట్టు త్వరగా తెల్లబడకుండా కాపాడుతుంది.తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలనుకునేవారు తప్పకుండా ఈ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.
పైగా ఈ మాస్క్ జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది.జుట్టును ఆరోగ్యంగా దృఢంగా మారుస్తుంది.
హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.జుట్టు ఒత్తుగా పెరిగేలా కూడా ప్రోత్సహిస్తుంది.







