ముఖంపై ఒక్క మచ్చ కూడా లేకుండా అందంగా మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ అటువంటి చర్మాన్ని పొందడం అంత సులభం కాదని భావిస్తుంటారు.
నిజానికి ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలితం దక్కుతుంది.స్పాట్ లెస్ స్కిన్( Spotless Skin ) ను అందించే పవర్ ఫుల్ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి.
వాటిలో రెండింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రెమెడీ 1:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) మరియు వన్ టీ స్పూన్ పెరుగు( Curd ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్న తగ్గుతాయి.
ఈవెన్ పిగ్మెంటేషన్ మచ్చలు కూడా మాయమవుతాయి.చర్మం అందంగా మృదువుగా మారుతుంది.
కాంతివంతంగా మెరుస్తుంది.మచ్చలేని చర్మం మీ సొంతమవుతుంది.

రెమెడీ 2:
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి ఒకటికి రెండుసార్లు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై ముదురు రంగు మచ్చలన్ని పోతాయి.స్పాట్ లెస్ స్కిన్ మీదవుతుంది.
అంతేకాకుండా ఈ రెమెడీ చర్మాన్ని టైట్ గా బ్రైట్ గా మారుస్తుంది.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.
చర్మం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది.మరియు చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తిని కూడా తగ్గించి మొటిమల సమస్యకు చెక్ పెడుతుంది.







