ప్రతి రోజు నెయిల్‌ పాలిష్‌ వల్ల కలిగే నష్టాలు ఎన్నో తెలుసా... ఆడవారు ఇది చదివితే దాని జోలికి వెళ్లరేమో

హీరోయిన్స్‌, మోడల్స్‌ మాత్రమే కాకుండా సాదారణ అమ్మాయిలు కూడా నెయిల్‌ పాలిష్‌ ను తెగ వాడేస్తున్నారు.ఒక్కో వేలికి ఒక్కో రంగు అంటూ వాడుతూ ఉంటారు.

 Nail Polish Ingredient Weight Gain Details, Duke University, Healthy Nails, Horm-TeluguStop.com

నెయిల్‌ పాలిష్‌ను ప్రతి రోజు కూడా మార్చుతూనే ఉన్నారు.నెయిల్‌ పాలిష్‌ ఒక్క రోజు పెట్టుకుని, దాన్ని తొలగించి మరో రంగు నెయిల్‌ పాలిష్‌ లు వాడుతూ ఉంటారు.

వేసుకున్న డ్రస్‌కు మ్యాచింగ్‌గా, వెళ్తున్న కార్యక్రమానికి మ్యాచింగ్‌గా నెయిల్‌ పాలిష్‌లను వాడుతూ ఉంటారు.అమ్మాయిలు వాడే నెయిల్‌ పాలిష్‌ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్థారించారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2500లకు పైగా నెయిల్‌ పాలిష్‌లు ఉన్నాయి.వీటిల్లో దాదాపు సగం కంపెనీలు నెయిల్‌ పాలిష్‌ మన్నికగా ఉండేందుకు, ఎక్కువ కాలం ఉండేందుకు ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ అనే రసాయనం వాడుతున్నారు.

ఆ రసాయనం మానవ శరీరంపై చాలా బలంగా ప్రభావం చూపుతుందని పరిశోదనల్లో వెళ్లడి అయ్యింది.మానవ శరీరంలోని హార్మోన్‌లపై సదరు రసాయనం ప్రభావం చూపడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటూ పరిశోధనల్లో వెళ్లడయ్యిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

డ్యూక్‌ యూనివర్శిటీ పరిశోదకులు చెబుతున్నదాని ప్రకారం ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ ఎక్కువగా ఉండే నెయిల్‌ పాలిష్‌లను వాడటం వల్ల మనిషి శరీరంలోని హార్మోన్‌లు ప్రభావితం అవుతాయి.

Telugu Duke, Healthy Nails, Nail Polish, Nailpolish, Nails, Tphp-Telugu Health -

ఆ వాసన ప్రతి రోజు చూసే వారు మెల్ల మెల్లగా బరువు పెరుగుతారని, మరీ ఎక్కువగా వాడితే మాత్రం బరువు మరీ ఎక్కువ పెరుగుతారని వారు పేర్కొన్నారు.నెయిల్‌ పాలీష్‌లను చర్మంకు అంటుకోకుండా వేసుకోకుంటే సగం వరకు ఇబ్బందులను తగ్గించుకోవచ్చు అని, అయితే ఎక్కువ శాతం మంది చర్మంకు కూడా నెయిల్‌ పాలిష్‌లను వేయిస్తారని, అది ఏమాత్రం కరెక్ట్‌ కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు.చర్మంకు అంటిన 10 నుండి 14 గంటల్లోనే నెయిల్‌ పాలీష్‌లోని టీపీహెచ్‌పీ పని చేయడం ప్రారంభించి బరువు పెరిగేలా చేస్తుందని అంటున్నారు.

అందుకే ఇకపై నెయిల్‌ పాలీష్‌లతో జాగ్రత్తగా ఉండండి.ముఖ్యంగా చర్మంకు నెయిల్‌ పాలీష్‌ అంటకుండా చూసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube