ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఎక్కువగా కుర్చీలో కూర్చొని పని చేస్తూ ఉన్నారు.ఇలా పని చేస్తే గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కనీసం వారానికి మూడు గంటలైనా ఫిజికల్ యాక్టివిటీ లేని వారికి గుండె సంబంధిత సమస్యలు( Heart diseases ) ఉంటాయని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.ముఖ్యంగా చెప్పాలంటే గంటల తరబడి కుర్చీలకు పరిమితమై ఉద్యోగాలు చేసే వారు ఎక్కువ శాతం దీర్ఘకాలిక వ్యాధుల కు గురవడంతో పాటు గుండెపోటు( Heart attack ), డయాబెటిస్, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఐటీ, ఐటీయేతర ఉద్యోగాల జీవన శైలిని పరిశీలించిన సైంటిస్టులు 22 శాతం మంది మాత్రమే శరీరక వ్యాయామాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుసుకున్నారు.మెజార్టీ ప్రజలలో జీవక్రియలు సమస్యాత్మకంగా ఉన్నాయని మెటబాలిక్ సిండ్రోమ్, హెడీఎల్, అధిక బరువు, బాన పొట్ట వంటి సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు.మహిళల కంటే మగవారిలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉండగా,అలాగే మహిళలలో పరిమితికి మించి ట్రైగ్లిజరైడ్స్ 150 మైక్రో గ్రాములు ఉన్నదని వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే ఎక్కువ గంటల పాటు వదలకుండా కూర్చునే వారిలో జీవక్రియలు మందగిస్తున్నాయని వెల్లడించారు.

ముఖ్యంగా చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధుల( Digestive diseases ) బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.ఒకే చోట కనీసం 8 గంటల పాటు పని చేసే వారు ఉదయం లేదా సాయంత్రం వేళలలో శరీరక వ్యాయమాలు లేదా కదలికలు చేయడం వల్ల గుండె రక్త ప్రసరణ మెరుగుపడడమే కాకుండా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం కాస్త తగ్గుతుందని సూచిస్తున్నారు.కాబట్టి ఎక్కువగా కుర్చీలలో కూర్చుని పని చేసే వారు వారానికి కనీసం మూడు నుంచి 7 గంటల వరకు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.