టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం లిస్ట్ అయింది.ఈ మేరకు 59వ నంబర్ గా చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ లిస్ట్ అయిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో చంద్రబాబు పిటిషన్ పై సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇరుపక్షాల వాదనలు ఇప్పటికే పూర్తి కాగా ధర్మాసనం సోమవారం మధ్యాహ్నా సమయానికి తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో క్వాష్ పిటిషన్ సుప్రీంలో కూడా డిస్మిస్ అవుతుందా ? లేదా ? అన్నది వేచి చూడాల్సిందే.