ద్రాక్ష పండ్లు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటుంటారు.
ద్రాక్ష పండ్లు రుచిగా ఉండటమే కాదువిటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, ఫైబర్, శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, సిట్రిక్ యాసిడ్ ఇలా బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.అందుకే ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి మేలని నిపుణులు చెబుతంటారు.
అవును, ద్రాక్ష పండ్లను డైట్‌లో చేర్చుకుంటే రక్త పోటు, మధుమేహం, గుండె వ్యాధులు, మతి మరుపు, చర్మం సమస్యలు ఇలా ఎన్నిటినో అధిగమించవచ్చు.అలా అని చెప్పి ద్రాక్ష పండ్లను పరిమితి మించి తీసుకుంటే మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆరోగ్యానికి ఎంత మంచి చేసినప్పటికీ వీటిని ఓవర్‌గా తినేస్తే బరువు పెరిగి పోతారు.

ఎందుకంటే, ద్రాక్ష పండ్లలో పోషకాలతో పాటు కొన్ని కేలరీలు కూడా ఉంటాయి.ద్రాక్షను అధికంగా తీసుకుంటే.అది అదనపు కేలరీలలోకి మారిపోతుంది.
ఫలితంగా వెయిట్ గెయిన్ అవుతారు.అలాగే ద్రాక్ష పండ్లను మోతాదుకు మించి తీసుకుంట శరీరంలోకి ఫ్రక్టోజ్ ఎక్కువగా విడుదల అవుతుంది.
దాంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదర్కోవాల్సి వస్తుంది.
అంతేకాదు, ద్రాక్ష పండ్లను అతిగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు మందగిస్తుంది.
దాంతో అజీర్తి, అతిసారం వంటి సమస్యలతో ఇబ్బంది పడాలి.ఇక ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినేస్తే శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగిపోతుంది.
కార్బోహైడ్రేట్స్ శరీరానికి అవసరమే.కానీ, ఎక్కువైతే మాత్రం ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ రిస్క్ పెరగడం జరుగుతుంది.
కాబట్టి, ఇకపై ఆరోగ్యానికి మేలన రుచిగా ఉన్నాయనో ద్రాక్ష పండ్లను అతిగా మాత్రం లాగించేయవద్దు.