Eyesight health tips : కంటి చూపు తగ్గుతుందా? అయితే వెంటనే దీన్ని డైట్ లో చేర్చుకోండి!

వయసు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం అనేది సర్వసాధారణం.కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.

 If This Juice Is Included In The Diet, Eyesight Will Increase! Eyesight, Eye Hea-TeluguStop.com

అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.మీకు కూడా కంటి చూపు తగ్గినట్టు అనిపిస్తుందా.? అయితే అసలు లేట్ చేయకండి.వెంటనే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.మందగిస్తున్న కంటి చూపు మళ్ళీ గాడిన ప‌డుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం కంటి చూపును మెరుగుపరిచే ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.

ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే రెండు ఉసిరి కాయలు తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉసిరి కాయ ముక్కలు, రెండు రెబ్బల కరివేపాకు, ఒక కప్పు ఆరెంజ్ పండు ముక్కలు, చిటికెడు పింక్‌ సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి ప‌ల్చ‌టి వ‌స్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ ను రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజూ సేవించాలి.

Telugu Amla, Carrot, Eye, Tips, Healthy Eyes, Orange-Telugu Health Tips

ఈ క్యారెట్ ఆరెంజ్ ఆమ్లా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా కంటి చూపును రెట్టింపు చేసి వివిధ రకాల కంటి సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి వ్యవస్థా బలపడుతుంది.మూత్రపిండాలు, లివర్ శుభ్రంగా మ‌రియు ఆరోగ్యంగా మారతాయి.చర్మం నిగారింపుగా మెరుస్తుంది.జుట్టు రాలడం సైతం తగ్గు ముఖం పడుతుంది.

కాబట్టి తప్పకుండా ఈ హెల్తీ జ్యూస్ ను డైట్ చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube