కొంతమంది సినిమాల కోసమే పుడతారు అని అంటూ ఉంటాం కానీ నిజంగానే కొందరు సినిమాల్లో నటించడానికి పుడతారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఒక పేద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన నాజర్ ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు.కామెడీ, విలనిజం ఏదైనా తను అలవోకగా నటించి ఆ క్యారెక్టర్ ని నిలబడగలిగే దమ్మున్న నటుడు నాజర్.
తను పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు వాళ్ల నాన్న నాటకాలు వేస్తూ ఉండేవాడు.
అలాగే వాళ్ల నాన్న పాత నగల కి మెరుగులు దిద్దుతూ అలా వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడిపేవారు.
వీళ్ళది పెద్ద ఫ్యామిలీ కావడంతో కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారింది దానికోసం నాజర్ కూడా నెలకి 500 సంపాదించడానికి ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు అలాగే తను PUC చదువుతున్నప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఒక జాబ్ కూడా చేశాడు కానీ వాళ్ల నాన్నకి మాత్రం నాజర్ ని ఒక మంచి నటుడిని చేయాలని కోరిక ఉండేది.నాజర్ ఎయిర్ పోర్ట్ లో జాబ్ చేస్తు వాళ్ళ నాన్న కోరికను నెరవేర్చాలి అనుకొని చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాడు.
రజనీకాంత్, సుధాకర్ లాంటివారు ఆ ఇనిస్ట్యూట్ లోనే యాక్టింగ్ నేర్చుకున్నారు వారు నాజర్ కి సీనియర్లు.చిరంజీవి, నాజర్ ఇద్దరు ఇనిస్టిట్యూట్లో క్లాస్మేట్స్ గా ఉండేవారు.
నాజర్ యాక్టింగ్ లో మాస్టర్ డిప్లమా చేసి యాక్టింగ్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు.దాంతో బయటికెళ్తే మనల్ని పిలిచి మరి సినిమాల్లో పెట్టుకుంటారు అని అనుకున్నాడు.
కానీ ఇక్కడ ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ చెన్నై లోని తాజ్ హోటల్ లో నెలకి 300 రూపాయలకి జాయిన్ అయ్యాడు మూడు వందల తో పాటు రోజు టిప్పు కూడా వస్తూ ఉండేది ఇలా సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నాజర్ కి రజినీకాంత్ ని, కమల్ హాసన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన బాలచందర్ గారి సినిమాలో అవకాశం వచ్చింది దాంతో వరుసగా ఆయనకి సినిమా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి కమలహాసన్ తీసిన చాలా సినిమాల్లో నాజర్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చేవాడు ముఖ్యంగా మణిరత్నం కమలహాసన్ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు సినిమా లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా తనదైన ఆక్టింగ్ చేసి అందర్నీ మెప్పించారు.ఆ తర్వాత రజనీకాంత్ సినిమాల్లో కూడా నటించారు నరసింహ, బాబా లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు.
ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి తన నటన ప్రతిభను చూపించగలిగే నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా నాజర్ అనే చెప్పాలి.
నాజర్ నటుడిగానే కాదు, రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు సాధించాడు.
నాజర్ తెలుగులో గౌతమ్ ఎస్.ఎస్.సి లాంటి సినిమాలో హీరో తండ్రిగా నటిస్తూ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా తనదైన మార్కు నటనతో జనాల్ని మెస్మరైజ్ చేశారు.కె ఎస్ రామారావు గారు నిర్మించిన మాతృదేవోభవ సినిమాలో మాధవి భర్తగా ఒక తాగుబోతు క్యారెక్టర్ లో ఏమి చేతకాని ఒక అసమర్ధుని క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించారని చెప్పవచ్చు.
అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలో మహేష్ బాబు నాన్న గా నటించి మంచి గుర్తింపు సాధించారు.హీరో మహేష్ బాబు చేసే ప్రతి సినిమాలో నాజర్ కి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఎందుకంటే నాజర్ యాక్టింగ్ అంటే మహేష్ కు చాలా ఇష్టం.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చాలా మంది చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం సంపాదిస్తూ పోగొట్టుకుంటారు అలాంటి వారిలో నాజర్ గారు మొదటి స్థానంలో ఉంటారు.
సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో తనకి డైరెక్షన్ చేయాలనిపించి నాలుగు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేశారు.రేవతి తో కలిసి అవతారం సినిమా లో నటిస్తూ దర్శకత్వం చేస్తూ ప్రొడ్యూస్ కూడా చేశారు.ఆ సినిమా తర్వాత వినీత్, కీర్తి రెడ్డి, నాజర్ లు ముఖ్యపాత్రల్లో ఒక సినిమా చేశాడు ఆ సినిమా కూడా ఆడలేదు దాంతో రోజా హీరోయిన్ గా తను హీరోగా మాయాన్ అనే సినిమా చేశాడు.
మోహన్ లాల్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా పాప్ కార్న్ అనే సినిమా తీశాడు అది కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు దాంతో తీవ్రంగా నష్టపోయారు నాజర్ గారు.ప్రస్తుతం తను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా గుర్తింపును సాధించారు.
సినిమాల్లో సంపాదించింది అంత ఎందుకు పోగొట్టారు అని ఎవరైనా అడిగితే సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పోగొట్టుకున్న అని తనకు తాను సమాధానం చెప్పుకుంటూ ఇతరులకు కూడా సమాధానం చెబుతున్నారు ఎంతైనా నాజర్ గారికి తమిళ్లో వచ్చినంత గుర్తింపు తెలుగులో రాలేదనే చెప్పాలి.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపుని సాధించాడు.