ఈ సృష్టిలో తల్లి అవ్వడం అనేది ప్రతి మహిళ ఓ గొప్ప వరంగా భావిస్తుంది.అయితే కొన్ని జంటలకు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగరు.
ఈ క్రమంలోనే పిల్లలు కలగడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు.ఇక్కడ మరో విషయం ఏంటంటే.
చాలా మంది దంపతుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుపోయినా.సంతానం కలగడం ఆలస్యమౌతూ ఉంటుంది.ఇందుకు కారణంగా వారు చేసే చిన్న చిన్న పొరపాటులే.
నిజానికి గర్భం పొందాలంటే.
కలయికతో పాటు శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి.మరియు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి.
ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవారు.ముందు నుంచే తాజాగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ ఇలా పోషకాహారాలు అన్నీ తీసుకోవాలి.
అదే సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా కూడా ఉండాలి.ముఖ్యంగా పాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
పాకేజ్డ్ ఫుడ్స్ అంటే.బిస్కెట్స్, బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్, చిప్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటిని తినకపోవడం మంచి.వీటి బదులు ఇంటి ఫుడ్‌కే ప్రేయారిటీ ఇవ్వాలి.ఎందుకంటే.
ఇంట్లో ఫ్రెష్‌గా తయారు చేసి తినడం ప్రెగ్నెన్సీ రావడానికి మొదటి మెట్టు.అలాగే బయట నుంచి తెచ్చే పెరుగు కూడా అస్సల తినకూడదు.
ఎందుకంటే.బయట పెరుగు ఫ్రెష్‌గా ఉండదు.
కానీ, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తినాలి.అది కూడా ఫ్రెష్ పెరుగు అంటే ఇంట్లో తయారు చేసుకున్నదే తీసుకోవాలి.ఇక నువ్వులు అవాంఛిత గర్భాధరణను నివారిస్తుంది.పీరియడ్స్ అయ్యేందకు సహాయపడుతుంది.
ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.కానీ, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవారు నువ్వులను డైలీ తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణుల.
బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.ప్రెగ్నెన్సీ కావాలనుకునేవారు వీటిని కాస్త మితంగా తీసుకోవాలి.