ఎగ్జిబిషన్‌కు వెళ్ళాలి అని ఎవరు అనుకోరు? ఈ విషయంలో చిన్న పిల్లలే కాదు.పెద్ద వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ అంటే తెగ ఇష్టపడుతూ ఉంటారు.
ఎందుకంటే అక్కడ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అనుభూతులు ఉంటాయి కాబట్టి.ఇక ఎగ్జిబిషన్‌కు వెళ్లిన వాళ్లు జెయింట్ వీల్ ఎక్కకుండా రానే రారు అని చెప్పుకోవాలి.
ఒక్క భయపడేవారు తప్పితే, భయం లేనివారు చాలామంది జెయింట్ వీల్ ఎక్కితేగాని ఇంటికి రారు.ఈ క్రమంలో చాలామంది కళ్ళు తిరుగుతాయనే భయంతో జెయింట్ వీల్ ( Giant Wheel )సీట్లలో గట్టిగా పట్టుకుని కళ్లు మూసుకుని కూర్చుంటారు.
అసలు విషయంలోకి వెళితే… వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మాత్రం పెద్ద ప్రాణాంతక సాహసమే చేసాడని చెప్పుకోవచ్చు.
అవును, ప్రస్తుతం నెట్టింట @terakyalenadena అనే ట్విటర్ హ్యాండిల్‌లో వైరల్ అవుతున్న వీడియో చూశారంటే షాక్ అవుతారు.వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.ఓ ఎగ్జిబిషన్‌లో( exhibition ) భారీ జెయింట్ వీల్ కనబడుతోంది.
వేగంగా తిరుగుతున్న ఆ జెయిట్ వీల్ మీద ఓ వ్యక్తి ఊయల మీద నిల్చుని మరీ సాహస కృత్యం చేశాడు.చక్రంతో పాటు తిరుగుతూనే పైకి, కిందకు తిరుగుతూ సాహసం చేశాడు.
అతడి సాహసాన్ని చూస్తున్న వారికే కళ్లు తిరిగేలా ఉందా దృశ్యం.అలాంటిది ఆ వ్యక్తి ఏ మాత్రం ఎటువంటి భయం లేకుండా ప్రశాతంతగా దాని మీద నిల్చోవడం చాలా ఆశ్చర్యకరం.
దాంతో ఆ వీడియో చూసిన జనాలు అవాక్కవుతున్నారు.
ఇక ఆ పిచ్చి తంతు చూసినవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇప్పటివరకు సదరు వీడియోని 25 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు.అంతేకాకుండా 14 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేయడం కొసమెరుపు.
ఈ క్రమంలోనే చాలామంది ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు.కొంతమంది “అతడు ప్రమాదానికే ప్రమాదం!” అని కామెంట్ చేస్తే… “ఇతడిని చూసి స్పైడర్ మ్యాన్ మాత్రమే కాదు బ్యాట్ మ్యాన్ కూడా భయపడతాడు!” అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.
మీరు కూడా సదరు వీడియోని చూసినట్లయితే మీరు కూడా ఓ కామెంట్ పడేయండి!
.