వేసవికాలంలో మట్టి కుండలో నీరు తాగడం వల్ల.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

వేసవి కాలంలో( summer ) చాలామంది ఎక్కువగా చల్లటి నీటిని ఇష్టపడుతూ ఉంటారు.అయితే కొంతమంది ఫ్రిజ్ లో నీళ్లను తాగుతూ ఉంటారు.

 Do You Know The Health Benefits Of Drinking Water In A Clay Pot During Summer ,-TeluguStop.com

అయితే ఫ్రిజ్లోని ఇలా నీళ్ల కన్నా మట్టికుండలోని నీళ్లు తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.అందుకే ఈ ఆధునిక యుగంలో కూడా మట్టికుండలకు బాగా క్రేజ్ పెరుగుతుంది.

అందుకే ఈ వేసవికాలంలో మట్టికుండలోనే( clay pot ) నీరు తాగడానికి గ్రామ ప్రజలు, నగర ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.అయితే మట్టి కుండలోని నీరు తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

అలాగే ప్లాస్టిక్ బాటిల్లలో, ప్లాస్టిక్ క్యాన్లలో నీళ్లు తాగితే డిస్పినాల్ ( Dispinol )లాంటి హానికర రసాయనాలు అందులో ఉంటాయి.ఇలాంటి నీరు తాగడం వలన ఆరోగ్యానికి హాని జరుగుతుంది.అలాగే ప్లాస్టిక్ డబ్బాలో నీటిని నిల్వ ఉంచడం కన్నా మట్టి కుండలో నీటిని నిలువ చేయడం చాలా మేలు.ఎందుకంటే మట్టి కుండలో నీరు తాగడంతో శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్( Testosterone hormone ) పెరగడానికి అవకాశం ఉంటుంది.

అలాగే మట్టికుండలలోని నీరు కూడా సహజ పద్ధతిలో చల్లగా అవుతాయి.దీని వలన జీవక్రియ మెరుగుపడుతుంది.మట్టికుండలు చాలా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.

ఆల్కలైన్ మట్టి నీటి ఆమ్లత్వాన్ని కాపాడుతూ పీహెచ్ సమతుల్యతను అందిస్తూ ఉంటుంది.అందుకే ఈ నీటిని తాగడం వలన మనకు గ్యాస్ట్రోనామిక్ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.మట్టి కుండలోని నీరు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

గొంతు నొప్పి, జలుబు కూడా మన దరికి రాకుండా ఉంటుంది.గొంతు నొప్పితో బాధపడుతున్న వారు ఈ నీరు తాగడం చాలా మంచిది.

అలాగే ఈ నీటిని తాగడం వలన జీర్ణక్రియ పెరగడమే కాకుండా శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది.వడదెబ్బ నుండి నివారణ కోసం కూడా ఈ నీరు చాలా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube