పిగ్మెంటేషన్.చాలా మంది ఎదుర్కొని చర్మ సమస్యల్లో ఇది ఒకటి.ముఖ్యంగా మహిళల్లో పిగ్మెంటేషన్ సమస్య అనేది అత్యధికంగా కనిపిస్తుంటుంది.ఎండల ప్రభావం, వయసు పైబడటం, పలు రకాల మందుల వాడకం, మద్యపానం, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల పిగ్మెంటేషన్ సమస్య ఏర్పడుతుంది.
దీని కారణంగా ముఖ సౌందర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.ఈ క్రమంలోనే పిగ్మెంటేషన్ సమస్యను వదిలించుకోవడం కోసం కొందరు రకరకాల క్రీములను వాడుతుంటారు.అలాగే కొందరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ సహజంగానే పిగ్మెంటేషన్ సమస్యను వదిలించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఇంకెందుకు ఆలస్యం ఈ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేయాలి.

ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ రోజు పెటల్స్ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వేపాకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి.అలాగే మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్ మరియు సరిపడా పచ్చి పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో ముఖ చర్మానికి అప్లై చేసుకోవాలి.

ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఈ హోమ్ రెమెడీని పాటిస్తే పిగ్మెంటేషన్ సమస్య క్రమంగా దూరమవుతుంది.స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది.అలాగే స్కిన్ వైట్నింగ్ కూడా ఈ రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది.చర్మంపై మొండి మచ్చలు ఉన్నా సరే దూరం అవుతాయి.కాబట్టి ఎవరైతే పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారో వారు కచ్చితంగా ఈ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని ట్రై చేయండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.