జబర్దస్త్ వీడడానికి అదే కారణం... అసలు విషయం చెప్పిన సింగర్ మనో!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.గత పది సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం ప్రారంభమై ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది.

 Singer Mano Clarity On Leaving Jabardasth Program Details, Jabardasth,singer Man-TeluguStop.com

ఈ కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ కార్యక్రమానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.ఈ కార్యక్రమానికి మొదట్లో రోజా నాగబాబు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించేవారు.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చారు.

Telugu Jabardasth, Mallemala, Manojabardasth, Nagababu, Roja, Mano, Mano Jabarda

ఇలా సింగర్ మనో కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేవారు.అయితే కొంతకాలానికి ఈయన కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడం జరిగింది.ఈ విధంగా సింగర్ మను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈయన వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు.

మల్లెమాల వారితో మనస్పర్ధలు రావడం వల్లే ఈ కార్యక్రమం నుంచి మనో తప్పకున్నారనే వార్తలు వినిపించాయి.

Telugu Jabardasth, Mallemala, Manojabardasth, Nagababu, Roja, Mano, Mano Jabarda

తాజాగా ఈ విషయంపై సింగర్ మనో స్పందించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తనకు మల్లెమాల వారితో ఎలాంటి గొడవలు లేవని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త విరామం మాత్రమే ఇచ్చానని తెలిపారు.కోవిడ్ కారణంగా కొన్ని షోలు వాయిదా పడ్డాయని , ఇందులో ఇళయరాజా, ఎఆర్ రెహమాన్‌లతో తాను చేయాల్సిన షోలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

 ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తను జబర్దస్త్ కార్యక్రమంతో పాటు సరిగమప కార్యక్రమానికి కూడా హాజరుకానున్నట్లు ఈ సందర్భంగా మనో జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడటానికి గల కారణాలను తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube