ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోలు అడ్డూఅదుపు లేకుండా పారితోషికాలు పెంచుతున్నారు.తమకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను మరింత పెంచుకోవాలనే ఆలోచనతో హీరోలు రెమ్యునరేషన్ ను పెంచుకోవడానికి సిద్ధమవుతున్నారు.
హీరోల గత సినిమాల కలెక్షన్లను బట్టి నిర్మాతలు సైతం పెరిగిన పారితోషికాలకు అంగీకరిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. హీరో విజయ్ రెమ్యునరేషన్ ఏకంగా 150 కోట్ల రూపాయలకు పెరిగిందని బోగట్టా.
ప్రభాస్, మరికొందరు టాలీవుడ్ స్టార్స్ కు విజయ్ కంటే ఎక్కువగానే క్రేజ్ ఉన్నా ఈ రేంజ్ రెమ్యునరేషన్ ను అయితే డిమాండ్ చేయడం లేదు.150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అంటే సినిమాకు ఏ మాత్రం నష్టం వచ్చినా నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది.కరోనా తర్వాత సినిమాల వ్యయం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుంది.

విజయ్ వారసుడు సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలు అందుతాయో చూడాల్సి ఉంది.విజయ్ రెమ్యునరేషన్ నిర్మాతలు షాకయ్యేలా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.వరుసగా ఫ్లాపులు వస్తే మాత్రం విజయ్ కెరీర్ కు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది.

పెరుగుతున్న బడ్జెట్లు సినిమాలకు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అవుతున్నాయి.రాబోయే రోజుల్లో విజయ్ క్రేజ్ పెరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.విజయ్ కెరీర్ పరంగా ఏ విధంగా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.
తర్వాత ప్రాజెక్ట్ లతో విజయ్ మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.విజయ్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.







