దోశల పిండిలో ఉడికించిన అన్నం లేదా మరమురాల పొడిని కలపాలి.
ఫ్రిజ్ లో పెట్టిన నిమ్మకాయ నుండి రసం బాగా రావాలంటే…ఫ్రిజ్ నుంచి తీసిన నిమ్మకాయను గోరువెచ్చని నీటిలో 5 నిముషాలు ఉంచి ఆ తరవాత రసం తీస్తే బాగా వస్తుంది.
వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెల్లుల్లిని పొట్టు తీసి తడి లేకుండా కొంచెం సేపు ఎండలో ఆరబెట్టి ఆలివ్ నూనెలో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి.
కూరగాయలు ఉడికించాక రంగు మారకుండా ఉండాలంటే…కూరను ఉడికించే సమయంలో చిటికెడు పసుపు,ఒక స్పూన్ ఆలివ్ నూనె వేయాలి.
మాడిన మూకుడు సులభంగా వదలాలంటే ఉప్పు వేసిన నిమ్మచెక్కతో రుద్ది కడగాలి.
కూరగాయలను కడిగే సమయంలో ఆ నీటిలో కొంచెం వెనిగర్, చిటికెడు ఉప్పు కలిపితే సూక్ష్మజీవులు నశిస్తాయి.
గసగసాలు అరగంట సేపు వేడి నీటిలో నానబెట్టి మిక్సీ చేస్తే గసగసాల పేస్ట్ మెత్తగా వస్తుంది.
టమోటా సూప్ మంచి రంగు రావాలంటే కొంచెం బీట్రూట్ రసం కలపాలి.
బూరెలు చీదకుండా రావాలంటే బూరెలు వేయటానికి ముందు పూర్ణాన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
ఇడ్లి పిండి ఒక్కోసారి అనుకోకుండా పలుచగా అయ్యిపోతుంది.
ఆ సమయంలో కొంచెం బొంబాయి రవ్వ కలపాలి.
గులాబ్ జామ్ మెత్తగా రావాలంటే గులామ్ జామ్ పిండిని కలిపే సమయంలో కొంచెం పాలు, నెయ్యి వేయాలి.