అమీర్ ఖాన్.ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు తగ్గట్టుగా తన బాడీని మలచుకోవడం.
ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పోయడంలో ఆయన పర్ఫెక్ట్.అందుకే అమీర్ ఖాన్ ను బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అని అంటూ ఉంటారు.
ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్బస్టర్ హిట్లు సాధించాడు.వయసు మీదపడుతున్నప్పటికి తన ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు.
వైవిధ్యమైన సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాడు.అయితే ఒకప్పుడు సినిమాలతో మాత్రమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన అమీర్ ఖాన్ ఇటీవల కాలంలో మాత్రం పెళ్లిళ్లు విడాకులతో కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయాడు.
మొదట్లో అమీర్ ఖాన్ వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇస్తాడు అని అనుకున్నారు.కానీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య రీనా కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.ఇక ఆ తర్వాత కొన్నాళ్లకే కిరణ్ రావు తో ప్రేమలో మునిగితేలిన అమీర్ ఖాన్ ఆ తర్వాత ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.సరే రెండో పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడైనా వైవాహిక బంధంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ విడాకుల వరకు వెళ్ళకుండా ఉంటారు అని అభిమానులు అనుకున్నారు.
కానీ ఇక రెండవ భార్య కిరణ్ రావ్ కి కూడా విడాకులు ఇస్తున్నాను అంటూ ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు అమీర్ ఖాన్.
అయితే విడాకులు ఇచ్చిన తర్వాత సెలబ్రెటీలు మాట్లాడుకోకుండా ఉండటం లాంటివి చూస్తూ ఉంటామ్.కానీ అమీర్ ఖాన్ మాత్రం తన భార్యలతో మాట్లాడుతున్నా అని చెబుతున్నాడు.ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా విడాకుల గురించి జనాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం.జనరల్ గా విడాకులు తీసుకున్న తర్వాత ఏ జంట అయినా కూడా ఒకరిని ఒకరు పట్టించుకోరు.
తిట్టుకుంటారు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు.విడాకులు తీసుకున్న వారి మధ్య ఆ రేంజ్ లో కోపం ఉంటుంది.
కానీ నా మాజీ భార్యలు మాత్రం విడిపోయిన తర్వాత కూడా ఎంతో ప్రేమగా ఉంటారు.మేము వివాహ వ్యవస్థని గౌరవిస్తాం.
అందుకే విడిపోయిన తర్వాత స్నేహితులుగా ఉన్నాము.మా పిల్లల విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటాం.
మాజీ భార్య తో ఇంత మంచి అనుబంధం ఉండటం నా అదృష్టం అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో అందరూ షాక్ అవుతారు అని చెప్పాలి.