భారతదేశాన్ని( India ) సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా, ముఖ్యంగా రైళ్లలో( Trains ) ప్రయాణించాలని అనుకుంటున్నారా, అయితే ఫ్రెంచ్ యూట్యూబర్ విక్టర్ బ్లాహో( French Youtuber Victor Blaho ) మాట వినండి.భారతదేశంలో లాంగ్ జర్నీ రైళ్లు, అందులోనూ లోయర్ క్లాసుల్లో ప్రయాణం చేయొద్దంటూ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు.స్వయంగా 46 గంటలు రైలు ప్రయాణం చేసి నరకం చూసిన తర్వాతే విక్టర్ ఈ హెచ్చరిక చేస్తున్నాడు.
“డు నాట్ అట్టెంప్ట్ a 46H ట్రైన్ జర్నీ ఇన్ ఇండియా – It BROKE ME” అంటూ యూట్యూబ్‌లో వీడియో పెట్టి తన రైలు ప్రయాణ కష్టాలను విక్టర్ వివరించాడు.ముంబై నుంచి వారణాసి, ఆగ్రా, ఆ తర్వాత ఢిల్లీ వరకు వివిధ రైళ్లలో ప్రయాణించాడు.స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ వంటి లోయర్ క్లాసుల్లో ప్రయాణం చేసి భారతీయ రైళ్లలో మంచి, చెడు అనుభవాలను చూశానంటున్నాడు.
కానీ, మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని వాపోయాడు.

రైళ్లలో పరిశుభ్రత లేకపోవడమే విక్టర్ చెప్పిన ప్రధాన సమస్య.చెత్తాచెదారంతో నిండిపోయిన రైలు బోగీలు, కంపు కొడుతున్న బాత్రూమ్‌లను వీడియోలో చూపించాడు.ఒక రైలులో ఏకంగా ఎలుక కనపడింది.
ఆ తర్వాత బొద్దింక కూడా కనిపించడంతో విక్టర్ షాక్ అయ్యాడు.“ఇక్కడ ఎలా పడుకోవాలి?” అంటూ అసహనం వ్యక్తం చేశాడు.దోమలు, పురుగులు భయంతో నిద్ర కూడా కరువైందని చెప్పాడు.

“నేను ఇక్కడ పడుకోలేను.ఇప్పుడే పురుగును చూశాను.ఇక్కడ తల పెట్టను” అంటూ విసుగు చెందాడు.
ఇంకా విక్టర్ కు కొన్ని వింత అనుభవాలు కూడా ఎదురయ్యాయి.ఒకతను విక్టర్ ను పట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడమన్నాడు.
ముంబైలో ఒక గర్ల్ ఫ్రెండ్, ఢిల్లీలో ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పి విక్టర్ ను ఇబ్బంది పెట్టాడు.మళ్లీ మళ్లీ వేరే వాళ్లతో వీడియో కాల్ మాట్లాడమని విసిగించాడు.
“ఇండియాకు వచ్చి మూడు వారాలు అయింది.నేను ఇంటికి వెళ్లాలి.నాకు ప్రశాంతత, నిశ్శబ్దం, శుభ్రమైన బెడ్ కావాలి” అంటూ విక్టర్ ఒక వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.“భారతదేశంలో లోయర్ క్లాసుల్లో 46 గంటలు ప్రయాణం నన్ను విరక్తుడిని చేసింది.దిక్కుతోచని స్థితిలో, పిచ్చివాడిలా అనిపించింది.నా తప్పు నుంచి నేర్చుకోండి.డబ్బులుంటే హైయ్యర్ క్లాసుల్లోనే టికెట్లు బుక్ చేసుకోండి” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.అతడి ఫుల్ యూట్యూబ్ వీడియోను https://youtu.be/njEnVnEmvZg?si=ed714yPtlh659xZl దీనిపై నొక్కి చూడొచ్చు.