ఇంట్లో ఈ వస్తువులు వాడితే క్యాన్సర్ రావడం ఖాయం..!

ఇంట్లో తరచూ వాడే వస్తువులతోనే క్యాన్సర్( Cancer ) బారిన పడతారని చాలామందికి తెలిసి ఉండదు.ఏదో రోజు తినే ఆహారపు అలవాట్లు లేదా జన్యుపరంగా మాత్రమే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని అందరూ భావిస్తూ ఉంటారు.

 If You Use These Things At Home, Cancer Is Sure To Come , Cancer, Health Profess-TeluguStop.com

కానీ మన జీవితంలో తరచూ మన ఇంట్లో వాడే వస్తువుల వల్లే క్యాన్సర్ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు( Health professionals ) చెబుతున్నారు.ప్లాస్టిక్ కంటైనర్ల నుండి మొదలుకొని, నాన్ స్టిక్ వంట సామాను వాడకాల వరకు క్యాన్సర్ వ్యాధులను తెస్తాయని చెబుతున్నారు.

అయితే ఇంట్లో వాడే పలు రకాల వస్తువుల కారణంగా వాటిని తాకడం, వాటిని అన్ని రకాలుగా వాడడం, వాటి వాసనను పీల్చుకోవడం లాంటి వాటి వలన క్యాన్సర్ లాంటి సమస్యల బారిన పడతారు.

Telugu Arsenic, Asbestos, Benzene, Cancer, Carcinogenic, Professionals, Stick Co

పర్యావరణంలో జరుగుతున్న మార్పులు కూడా ఒక కారణమైతే మన జీవన శైలి కూడా మరొక కారణం అని నిపుణులు చెబుతున్నారు.కార్సినోజెనిక్ ( Carcinogenic )వంటి గృహోపకరణాలు క్యాన్సర్ ప్రభావాన్ని పెంచుతాయట.బెంజీన్, ఆస్బెస్టాస్, వినైల్ క్లోరైడ్, రాడాన్, ఆర్సెనిక్, ట్రైక్లోరెథైలీన్ అనే విషపూరిత పదార్థాలకు ప్రజలు గురైనపుడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

అయితే ఇంట్లో నాన్ స్టిక్ పాన్లు వంట చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము.అయితే వ్యాధి ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు హానికరమైన పెర్ఫ్లోరినేటెడ్ రసాయనాలను విడుదల చేస్తాయి.

సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా సిరామిక్ లేదా తారాగణం-ఇనుప వంట సామాను ఎంచుకోవడం మంచిది.

Telugu Arsenic, Asbestos, Benzene, Cancer, Carcinogenic, Professionals, Stick Co

అలాగే కొవ్వొత్తులను కాల్చడం వలన క్యాన్సర్ తో సంబంధం ఉన్న టోలున్, బెంజీన్‌తో తో సహా రసాయనాలు విడుదలవుతాయి.ఎక్స్పోజర్ తగ్గించడానికి సోయా క్యాండిల్స్ లేదా బిస్వాక్స్ క్యాండిల్స్ లాంటి సహజ క్యాండిల్స్ ను వాడాలి.కొన్ని పెయింట్లు వార్నిష్‌లు.

బెంజీన్, ఫార్మాల్డిహైడ్, టోల్యూన్ లాంటి రసాలను కలిగి ఉంటాయి.కాబట్టి ఇవి దీర్ఘకాలం ఎక్స్పోజర్ తో క్యాన్సర్ తో ముడిపడి ఉంటుంది.

ప్లాస్టిక్ ఆహార నిల్వ కంటైనర్లలో కూడా బిస్ఫినాల్ A, థాలేట్‌లు ఉంటాయి.ఈ రెండు క్యాన్సర్ కారకాలే.

అలాగే ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి అలాగే మళ్ళీ వేడి చేయడానికి గాజులేదా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లను ఎంచుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube