వైరల్: ఎండల దెబ్బకి ఆ విదేశీయుడు రోడ్డుపై ఏకంగా..

ఇండియాలో ఎండలు బగ్గుమంటున్నాయి.ఈ ఎండల్లో బయటికి వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.

 Foreigner Pushing Piece Of Ice On The Road Due To High Temperatures In Kerala Vi-TeluguStop.com

నీ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందే కూల్ డ్రింక్స్ తాగుతున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాలనుకుంటే గొడుగులు వేసుకొని వస్తున్నారు.

అయితే కొందరు వినూత్నంగా ఆలోచించి ఎండ వేడిమిని తిప్పి కొడుతున్నారు.అలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా, ఒక ఫారినర్( Foreigner ) ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎవరు ఊహించని ఒక పని చేశాడు.అది చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.

Telugu Hot, Cube, India, Kerala, Piece, Road, Effect-Latest News - Telugu

వైరల్ వీడియో ప్రకారం, కేరళలో( Kerala ) ఓ విదేశీయుడు మిట్ట మధ్యాహ్నం ఏదో పని కోసం బయటికి వస్తాడు.అయితే మిట్ట మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు( Temperature ) బాగా పెరిగిపోవడం కారణంగా అతడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు.భానుడి భగభగ నుంచి తప్పించుకునేందుకు ఒక ఐడియా అతడిని బుర్రకు తడుతుంది.కానీ అది చాలా విచిత్రమైన ఐడియా.అదేంటంటే ఈ విదేశీయుడు ఓ పెద్ద ఐస్ గడ్డ( Ice Cube ) చేత పట్టుకొని బయటికి వస్తాడు.ఐస్ ముక్కను రోడ్డుపై తోస్తూ ముందుకు వెళ్తుంటాడు.

బాగా ఎండగా అనిపించినప్పుడు దానిపై కూర్చొని రిలీఫ్ పొందుతుంటాడు.

Telugu Hot, Cube, India, Kerala, Piece, Road, Effect-Latest News - Telugu

ఆ విధంగా ఈ విదేశీయుడు ఐస్ ముక్క ద్వారా ఉపశమనం పొందుతూ ముందుకు సాగాడు, బహుశా ఇలాంటి దృశ్యం ఎవరూ చూసి ఉండరు.ముఖ్యంగా ఇండియా వాళ్లకి ఇతడి ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది అందుకే వారి షాక్ అయ్యి అలానే చూస్తుంటారు.కొందరు ఈ ఘటనను తమ ఫోన్ కెమెరాల్లో రికార్డు చేసి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పంచుకున్నారు అప్పటినుంచి ఇది విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

దాన్ని చూసి నెటిజన్లు నోరెళ్ల బెడ్తున్నారు.ఇలాంటి ఐడియా నెవ్వర్‌ బిఫోర్ అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.ఈ విచిత్రమైన ఫారినర్ వీడియో మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube