యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.19 సంవత్సరాల వయస్సులోనే ఆది సినిమాలో( Aadi Movie ) నటించి ఆ సినిమాతో తారక్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆది సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ( Producer Mallidi Satyanarayana ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు.
కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 18 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
చెప్పాలని ఉంది అనే సినిమాకు వినాయక్ అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారని ఆ సినిమా పాటల కోసం ఔట్ డోర్ కు వెళ్లగా వడ్డే నవీన్ చెప్పాలని ఉంది సినిమా కోసం అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు.అక్కడ సుబ్బు సినిమా సాంగ్స్ షూటింగ్ సైతం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

వినాయక్,( Vinayak ) ఎన్టీఆర్( NTR ) ఒకే హోటల్ లో దిగారని వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో వినాయక్ తాను త్వరలో డైరెక్టర్ కాబోతున్నానని చెప్పి ఆకాష్ హీరో అని బెల్లంకొండ సురేష్ నిర్మాత అని చెప్పారని చెప్పుకొచ్చారు.ఆ సమయంలో తారక్ ఆ కథేదో నాకు చెప్పు అని అడిగాడని తర్వాత రోజుల్లో ఆ కాంబినేషన్ లో ఆది మూవీ సెట్ అయిందని చెప్పుకొచ్చారు.

ఆది సినిమా 50 డేస్, 100 డేస్ సెంటర్ల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేసింది.ఆది సినిమా తర్వాత తారక్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా ఏడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి.