న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ క్లారిటీ

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

2 కాలేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై షర్మిల విమర్శలు

  కాలేశ్వరం పంప్ హౌస్ లు మునిగాయని, వాటి ప్రాజెక్టు పనులు తిరిగి మెగా కృష్ణారెడ్డికి అప్పగిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. 

3.వరద సహాయక చర్యలు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలి

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

వరద సహాయక పనులు కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 

4.ఎంపీ అరవింద్ కు చెప్పులు దండ వేసేందుకు టిఆర్ఎస్ ప్రయత్నం

  జగిత్యాల జిల్లాలో బిజెపి ఎంపీ అరవింద్ కాన్వాయ్ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.ఈ సందర్భంగా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.ఎంపీ అరవింద్ కు చెప్పుల దండ వేసేందుకు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. 

5.గోదావరి వరద ఉధృతిపై కేసీఆర్ కీలక ఆదేశాలు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ నేపథ్యంలో భద్రాచలం కి హెలికాప్టర్ , అదనపు రక్షణ సామాగ్రి తరలించాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 

6.వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

  వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు.లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

7.ఉస్మాన్ సాగర్ కు పెరుగుతున్న వరద

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

ఉస్మాన్ సాగర్ కు వరద పెరుగుతోంది.భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో రెండు గేట్ల ద్వారా మూసిలోకి 48 క్యూసెక్కుల నీరు వెళుతోంది. 

8.గోదావరి కరకట్ట వద్ద పోలీసుల ఆంక్షలు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి కరకట్ట వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.మీడియాను అనుమతించేందుకు నిరాకరించారు. 

9.భూ వివాదం కేసులో మరోసారి కోర్టుకు దగ్గుపాటి రానా

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

 ఓ భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు దగ్గుపాటి రాణా సిటీ సివిల్ కోర్టుకు మరోసారి హాజరయ్యారు. 

10.నేడు లాల్ దర్వాజా బోనాలు

  లాల్ దర్వాజా బోనాలు నేడు ప్రారంభమయ్యాయి. 

11.కెసిఆర్ పై కేంద్ర మంత్రి ఆగ్రహం

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు .టిఆర్ఎస్ పీఠాలు కదిలిపోతున్నాయి కాబట్టే, బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

12.పవన్ కళ్యాణ్ పై రోజా కామెంట్స్

  పవన్ కళ్యాణ్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని , పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళకుండా, ఇతర పార్టీలకు ఓట్లు వేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ రోజా విమర్శించారు. 

13.కొడాలి నాని ఇంటివద్ద ఉద్రిక్తత

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ నాని ఇంటి ముట్టడికి జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు.దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. 

14.జగన్ ఏరియల్ సర్వే

  గోదావరి అంక గ్రామాలు నీట మునిగి ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. 

15.విశాఖ జిల్లా పర్యటన కు జగన్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

ఏపీ సీఎం జగన్ రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 

16.ఏపీలో 840 బార్లకు మాత్రమే అనుమతి

  ఏపీలో బార్ల లైసెన్సుల జారీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు.మొత్తం 840 బార్లకు మించి అదనంగా ఒక లైసెన్స్ కూడా జారీ చేయబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. 

17.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : కోమటిరెడ్డి

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

18.  ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా

  తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలను ఆగస్టు ఏడో తేదీకి వాయిదా వేశారు. 

19.ధవలేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kishan Reddy, Komatireddy, Ktr, Puvvada Ajay, Roja,

గోదావరిలో వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 

20.మున్సిపల్ ఉద్యోగుల జీతాల పెంపు

  ఏపీలో మున్సిపల్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.కార్మికుల జీతాలు పెంపునకు జగన్ అంగీకారం తెలిపారు.       

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube