విదేశీ విద్యార్ధులపై బహిష్కరణ కత్తి .. అమెరికాలో కోర్టుకెక్కిన స్టూడెంట్స్

ట్రంప్ అధ్యక్షుడిగా( President Trump ) బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు విదేశీయులకు షాకిస్తున్నాయి.అమెరికా ప్రభుత్వం ఎప్పుడు? ఏ బాంబు పేలుస్తుందో? తెలియక వలసదారులు, విద్యార్ధులు షాక్ అవుతున్నారు.ఇక రెండ్రోజుల క్రితం అమెరికాలో నివసిస్తున్న విదేశీయులంతా ఖచ్చితంగా ఫెడరల్ ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అలాగే 24/7.ధ్రువీకరణ పత్రాలను తమ వద్దే ఉంచుకోవాలని తీసుకొచ్చిన నిబంధన దుమారం చర్చనీయాంశమైంది.

 International Students File Petition In Us Court Over Widespread Visa Revocation-TeluguStop.com
Telugu International, Donald Trump, Visa-Telugu NRI

హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధం( Hamas – Israel War ) సమయంలో అమెరికన్ విద్యాసంస్థల్లో( US Universities ) నిరసనకు దిగినవారిని.వారికి మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అమెరికా ప్రభుత్వం జల్లెడ పడుతోంది.అలాంటి వారు తక్షణం అమెరికాను విడిచి వెళ్లాలని.స్వచ్ఛందంగా సీబీపీ యాప్ ద్వారా వెళితే భవిష్యత్తులో అమెరికా రావడానికి అవకాశం కల్పిస్తామని లేదంటే శాశ్వతంగా అమెరికాలో అడుగుపెట్టకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు.

ఇప్పటికే ఇలాంటి వారు దేశం వదిలి వెళ్లిపోవాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్ధులకు మెయిల్స్ పంపారు.తాజాగా దేశంలోని పలు వర్సిటీలకు చెందిన విద్యార్ధుల వీసాలను( Students Visa ) అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది.

దీంతో వీరందరినీ ఏ క్షణంలోనైనా బహిష్కరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Telugu International, Donald Trump, Visa-Telugu NRI

అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విదేశీ విద్యార్ధులు( International Students ) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఉన్నపళంగా తమ వీసాలు రద్దు చేస్తే తమ భవిష్యత్తు ఆందోళనలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలు సహా మేరీలాండ్, ఒహియో స్టేట్ వంటి విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న పలువురు విద్యార్ధులు కోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు.

మరి వీరి పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.వీరికి ఓ అవకాశం ఇస్తుందా? లేక ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube