ఎన్టీఆర్(NTR) పరిచయం అవసరం లేనిపేరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాకుండా అభిమానులను తెగ కంగారు పెడుతుంది.ఎన్టీఆర్ బాగా సన్నబడి కనిపించడమే కాకుండా తన బాడీలో ఫిట్నెస్ కూడా లేకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఎన్టీఆర్ ఇలాంటి లుక్ లో కనిపించడానికి గల కారణం ఏంటి అంటూ అభిమానులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.బహుశా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటూ అభిమానులు భావిస్తున్నారు.ఇలాంటి తరుణంలోనే ఎన్టీఆర్ లుక్ కి సంబంధించి తన అన్నయ్య కళ్యాణ్ రామ్(Kalyan Ram) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం కళ్యాణ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S/O Vyjayanthi) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవడంతో కళ్యాణ్ రామ్ స్పందించారు.ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల కోసం ఏమైనా చేస్తాడు.సినిమా కోసం శరీర బరువు పెరగాలన్న తగ్గాలన్న తగ్గుతాడు.సినిమాల కోసం ఏం చేయడానికైన తారక్ వెనకాడడు.తనకు సినిమా అంటే విపరీతమైన పిచ్చి అనే ఒక జబ్బు ఉంది.
సినిమా కోసం ఎంత కష్టమైనా అనుభవిస్తాడు.అందుకే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా కోసమే ప్రస్తుతం తన శరీర బరువు తగ్గి ఇలాంటి లుక్ లో కనిపిస్తున్నారని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.