పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భార్య అన్నా లెజినోవా(Anna Lezinova) ఇటీవల తిరుమల ఆలయానికి వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.తన కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంలో చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.ఇలా తన కొడుకుని ఈ ప్రమాదం నుంచి బయటపడేయడంతో అన్నా లెజినోవా తిరుపతికి (Tirupathi)వెళ్లి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.

అన్నా లెజినోవా క్రిస్టియన్ అయినప్పటికీ తిరుపతికి వెళ్లడానికి ఈమె డిక్లరేషన్ ఇచ్చి మరి కొండపైకి వెళ్లడమే కాకుండా తలనీలాలు కూడా సమర్పించారు.అనంతరం అన్న ప్రసాదం కోసం దాదాపు 17 లక్షల వరకు విరాళం అందజేసి స్వయంగా తన చేతులతోనే భక్తులకు వడ్డించారు.ఇలా తిరుమలలో ఈమె ప్రత్యేకమైన పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వీడియోలపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా ఈమె తలనీలాలు సమర్పించడం పై విమర్శలు వస్తున్న తరుణంలో ఈ విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సినీ నటి విజయశాంతి(Vijayshanthi) స్పందించారు.

ఈ సందర్భంగా విజయశాంతి స్పందిస్తూ…దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం.అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం నుంచి తన కుమారుడు బయటపడినందుకు ఈమె ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు.సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పలేదు అంటూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.