మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల శంకర్(Shankar) దర్శకత్వంలో నటించిన చిత్రం గేమ్ చేంజర్(Game Changer).సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు కూడా వచ్చాయి.అయితే ఈ సినిమా గురించి కొందరు ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ కామెంట్లను స్ప్రెడ్ చేస్తూ సినిమాని తొక్కేశారు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ (S.S.Taman) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.తమన్ డాకు మహారాజు సక్సెస్ ఈవెంట్లో ఎమోషనల్ అయి మాట్లాడారు.సినిమాని చంపకండి, నిర్మాతలను బతకనివ్వండి అంటూ ఫైర్ అయ్యారు.దీంతో ఆ స్పీచ్ వైరల్ గా మారింది.

తాజాగా తమన్ యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి హాజరు అయ్యారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ ఈయనని ప్రశ్నిస్తూ ఆరోజు ఎందుకని గేమ్ చేంజర్ సినిమా గురించి అలా మాట్లాడారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు తమన్ సమాధానం చెబుతూ.
ఈ సినిమా విడుదల సమయంలో దిల్ రాజు గారు చాలా బాధపడ్డారు ఆయన అంతలా బాధపడటం నేనెప్పుడూ చూడలేదు.సినిమా విడుదలకు ముందు తనకి టార్చర్ చూపించారని తమన్ తెలిపారు.

ఈ సినిమా నాలుగు సంవత్సరాల క్రితం సినిమా అంటూ కామెంట్లు చేశారు.ఒక సినిమా తొందరగా విడుదలైన ఆలస్యంగా విడుదలైన పరిస్థితులను బట్టే ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.ఏ నిర్మాత తన సినిమాని చంపుకోడు.అది జరిగినప్పుడు ఎవరూ వచ్చి సపోర్ట్ గా నిల్చోలేదని నా బాధ.ఆ సమయానికి అందరు ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేసి ఉంటే బాగుండు.సినిమా పైరసి రావడం, బయట ప్లే చేయడం, బస్సుల్లో ప్లే చేయడం.
ఇదంతా చూస్తుంటే కావాలని ఈ సినిమాపై కుట్ర చేశారని అనిపిస్తుంది.ఇలా ఈ సినిమాకు నెగిటివిటీని స్ప్రెడ్ చేయటం వల్ల నిర్మాతకు ఏకంగా 140 కోట్ల నష్టాలు వచ్చాయని ఈ సందర్భంగా తమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.