తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్త ఫాలోయింగ్ సంపాదించి స్టార్ ఎదిగితే చాలు కొంతమందికి కుళ్ళు పుట్టి వారిపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.అయితే రెండోతరం టాప్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ గారిపై మాత్రం ఇప్పటివరకు ఒక్క నెగటివ్ కామెంట్స్ గాని ఎలిగేషన్స్ కానీ రాలేదు.1986 లో అయన మొదటి డెబ్యూ అయినా కలియుగ పాండవులు సినిమా రిలీజ్ అయింది.ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 35 సంవత్సరాల కెరియర్ లో ఒక్క మచ్చ కూడా లేకుండా ముందుకెళ్తున్నారంటే.
మన వెంకీ మామ గొప్పతనం ఏంటో మనం అర్థంచేసుకోవచ్చు.
అంతేకాదు మన వెంకీ మామ కి ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ తన ఫాలోయింగ్ ని కూడా పెంచుకుంటూ అందుకు తగిన విధంగా పాత్రల ఎంపిక చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాడు.
రామానాయుడు కొడుకుగా ఆయన ఘనకీర్తిని ఇంకొక మెట్టు ఎక్కించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే సినిమాకి సంబంధించిన విషయాలు తప్ప తన వ్యక్తిగత జీవితం లోకి ఏ ఒక్కరిని తొంగిచూడనివ్వరు వెంకటేష్ గారు… ఆయన భార్య నీరజ సైతం అడపదడప ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే తప్ప బయట కనిపించరు మరి ఇంత Low profile మైంటైన్ చేస్తూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయడంలో హీరో వెంకటేష్ గారి తర్వాతే ఎవరైనా.
సినిమా షూటింగ్ కి వెళ్ళామా ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండే ఆయన బయట ఏలాంటి విషయాల్లో జోక్యం చేసుకోరు.అందుకే వెంకటేష్ గారి ఫ్యామిలీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

అయితే కొన్నాళ్ల క్రితం ఒక సినిమా ప్రొమోషన్ భాగంగా వెంకటేష్ గారు తన భార్య గురించి, తనపై తనకున్న ప్రేమ గురించి బయటపెట్టాడు.1985 లో చిత్తూరుకి చెందిన గన్నవరపు సుబ్బారెడ్డి కుమార్త నీరజా తో వివాహం జరిగింది.ఇక వెంకటేష్ గారు డబ్బున్న కుటుంబంలో పుట్టి అమెరికా వెళ్లి చదవుకోని వచ్చినా.ఆకతాయి అలవాట్లు ఏవి కూడా ఆయనకు అలవాటు కాలేదు.ఎక్కడ షూటింగ్ జరిగినా సాయంత్రానికి ఇంటికి వెళ్లి సరదాగా తన భార్యతో టైం స్పెండ్ చేయకపోతే వెంకీగారికి అసలేమీ తోచదట.అంతేకాదు రోజు ఎలా గడించింది అనే విషయాలు కూడా తన భార్యతో పంచుకొని కాసేపు సరదాగా మాట్లాడుకొని.
ఎంత లేట్ అయినా ఇద్దరు కలిసి భోజనం చేయడం అలవాటట.ఇంకా భార్య పిల్లలతో కలిసి బయటకు వెళ్లి రెస్టారెంట్ లో భోజనం చేయడమంటే తనకెంతో ఇష్టమని కూడా వెంకటేష్ తెలియజేసారు.
ఇంకా తన భార్య అంటే తనకెంతో ఇష్టమని.తాను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి కారణం వెంకీ మామ భార్య నీరజనే కారణమని వేంకటేశ గారు తెలియజేసారు.
అంతేకాదు తన భార్య తన పక్కనే ఉంటే నేనెప్పుడూ విజయం సాధిస్తానని కూడా ఎలాంటి అహం లేకుండా తన భార్యమీద వున్నా అభిమానం ఏంటో తెలియజేశారంటే వెంకీ మామ మనసెంతో మనం అర్ధం చేసుకోవచ్చు.ఇక వెంకటేష్ నారప్ప అనే సినిమాతో సమ్మర్ లో మనముందుకు రాబోతున్నారు.
సో, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అలాగే వెంకటేష్ గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం.