అసలే వేసవికాలం.( Summer ) ఎండలు మండిపోతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొంత చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ.కొన్ని ప్రాంతాల్లో మాత్రం భానుడు బెంబేలెత్తిస్తున్నాడు.
అయితే వేసవి వేడికి బాడీ డిహైడ్రేట్ అయ్యి విపరీతమైన నీరసం( Fatigue ) ఏర్పడుతుంటుంది.చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.
ఏ పని చేయలేకపోతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కనుక తీసుకుంటే నీరసం దెబ్బకు పరార్ అవుతుంది.

జ్యూస్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ క్యారెట్ ముక్కలు( Carrot ) వేసి అర గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటి పండును( Banana ) పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ క్యారెట్ జ్యూస్, ఒక క ప్పు కాచి చల్లార్చిన పాలు,( Milk ) రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ బనానా జ్యూస్ అనేది రెడీ అవుతుంది.

ప్రస్తుత వేసవికాలంలో ఈ జ్యూస్ హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ జ్యూస్ నీరసం, అలసటను తొలగిస్తుంది.శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది.తలనొప్పికి చెక్ పెడుతుంది.వేసవి తాపాన్ని తగ్గిస్తుంది.బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.
అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.సన్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
కాబట్టి వేసవి వేడికి విపరీతంగా నీరసం వస్తుందని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న క్యారెట్ బనానా జ్యూస్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి.