సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఒకరు.చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఈయన మాత్రం తన సొంత టాలెంట్ తో నటుడిగా నిరూపించుకుంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు అడుగులు వేశారు.ఇలా ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసిన పవన్ అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటంతో జనసేన పార్టీని( Janasena Party ) స్థాపించారు.

ఇక జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈయన ఒకవైపు పార్టీ కార్యకలాపాలను చూసుకుంటూనే మరోవైపు పలు సినిమాలకు కమిట్ అవుతూ సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసేవారు.అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.అదేవిధంగా ఐదు శాఖలకు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన ఇకపై సినిమాలు చేస్తారా తమ అభిమాన హీరోని మరోసారి మేము తెరపై చూడగలమా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఒక తమిళ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఇదే ప్రశ్న ఎదురైంది.ఇకపై మీరు సినిమాలు ఆపేస్తారా అంటూ ప్రశ్న వేయడంతో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.రాజకీయాల పరంగా తన పార్టీని నిలబెట్టడం కోసం నాకు డబ్బు అవసరం అవుతుంది.
ఇలా నాకు డబ్బు అవసరం ఉన్నన్ని రోజులు తాను సినిమాలలో నటిస్తానని చెప్పేశారు.అయితే పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండానే రెండు బ్యాలన్స్ చేసేలా ప్లాన్ చేస్తానని వివరించారు.
పవన్ కళ్యాణ్ ఇలా సినిమాలు చేస్తానని చెప్పారు కానీ చేయడం చాలా కష్టమని మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికలకు ముందు ఈయన కమిట్ అయిన సినిమాలను ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు.
కొత్త వాటికి కమిట్ అయితే వాటికి న్యాయం చేయగలరా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.