వైరల్ వీడియో: ధోనీ క్రేజ్ చూసి నీతా అంబానీ షాకింగ్ రియాక్షన్.. సోషల్ మీడియాలో రచ్చ!

క్రికెట్ (Cricket)ప్రపంచంలో ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది.చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ మ్యాచ్ మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగింది.

 Viral Video: Nita Ambani's Shocking Reaction After Seeing Dhoni's Craze.. Social-TeluguStop.com

అక్కడ ధోనీ బ్యాటింగ్‌కు దిగుతుంటే జనాలు గోలకి చెవులు చిల్లులు పడిపోయేలా అరిచారు.ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ(Nita Ambani) కూడా ఆ అరుపులుకి షాక్ అయిపోయి, చేతులతో చెవులు మూసుకోవాల్సి వచ్చింది.

ధోనీ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే స్టేడియం దద్దరిల్లిపోయింది.

ఇంకాస్త డీటైల్‌గా చెప్పాలంటే, 19వ ఓవర్లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అవుటయ్యాక ధోనీ(Dhoni) 8వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు.

నిజానికి అతను ఆడింది రెండే బంతులు, ఒక్క పరుగు కూడా చేయలేదు.కానీ ధోనీ క్రీజులోకి వచ్చాడంటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.స్టేడియంలో ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.ఆ మూమెంట్ చూసిన వాళ్లెవ్వరూ లైఫ్‌లో మర్చిపోలేరు.

ముంబై ఇండియన్స్ పెట్టిన 156 పరుగుల టార్గెట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా చేజ్ చేసింది.ఇంకో 5 బంతులు మిగిలి ఉండగానే, 4 వికెట్లు తేడాతో మ్యాచ్ గెలిచింది.ధోనీ స్కోర్ బోర్డులో పెద్దగా స్కోర్ చేయకపోయినా, అతని ప్రెజెన్స్ టీమ్‌లో మాత్రం ఫుల్ జోష్ నింపింది.ఈ విక్టరీతో CSK ఐపీఎల్ 2025 సీజన్‌ను అదిరిపోయే స్టార్ట్‌తో మొదలుపెట్టింది.

ఐపీఎల్(IPL) స్టార్ట్ అయినప్పటినుంచి ధోనీనే CSK టీమ్‌కు వెన్నెముకలాంటి ప్లేయర్.అతని కెప్టెన్సీలోనే టీమ్ ఏకంగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ కొట్టింది.దాంతో CSK మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది.2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు, CSK ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ కింద 4 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది.కెప్టెన్సీని 2024లోనే రుతురాజ్ గైక్వాడ్‌కు ఇచ్చేసినా, టీమ్‌లో మాత్రం ధోనీ ఇంకా కీలకమైన ప్లేయరే.

ధోనీ ఇప్పటివరకు CSK తరఫున 4,669 పరుగులు చేశాడు.దాంతో టీమ్ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ రన్-స్కోరర్‌గా ఉన్నాడు.సురేష్ రైనా రికార్డును బ్రేక్ చేసి CSK తరఫున టాప్ రన్-స్కోరర్‌గా నిలవడానికి ధోనీకి ఇంకో 19 పరుగులు మాత్రమే కావాలి.

ధోనీ ఈ మైలురాయిని చేరుకోవడం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్, ఇది జరిగితే ధోనీ లెజెండరీ స్టేటస్ మరింత పక్కా అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube