క్రికెట్ (Cricket)ప్రపంచంలో ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ మ్యాచ్ మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగింది.
అక్కడ ధోనీ బ్యాటింగ్‌కు దిగుతుంటే జనాలు గోలకి చెవులు చిల్లులు పడిపోయేలా అరిచారు.
ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ(Nita Ambani) కూడా ఆ అరుపులుకి షాక్ అయిపోయి, చేతులతో చెవులు మూసుకోవాల్సి వచ్చింది.
ధోనీ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే స్టేడియం దద్దరిల్లిపోయింది.ఇంకాస్త డీటైల్‌గా చెప్పాలంటే, 19వ ఓవర్లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అవుటయ్యాక ధోనీ(Dhoni) 8వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు.
నిజానికి అతను ఆడింది రెండే బంతులు, ఒక్క పరుగు కూడా చేయలేదు.కానీ ధోనీ క్రీజులోకి వచ్చాడంటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.
స్టేడియంలో ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.ఆ మూమెంట్ చూసిన వాళ్లెవ్వరూ లైఫ్‌లో మర్చిపోలేరు.
"""/" /
ముంబై ఇండియన్స్ పెట్టిన 156 పరుగుల టార్గెట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా చేజ్ చేసింది.
ఇంకో 5 బంతులు మిగిలి ఉండగానే, 4 వికెట్లు తేడాతో మ్యాచ్ గెలిచింది.
ధోనీ స్కోర్ బోర్డులో పెద్దగా స్కోర్ చేయకపోయినా, అతని ప్రెజెన్స్ టీమ్‌లో మాత్రం ఫుల్ జోష్ నింపింది.