గుజరాత్‌కు(Gujarat) చెందిన హర్ష్, మృదు అనే జంట 64వ పెళ్లి రోజుని (64th wedding anniversary)గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.వాళ్లకి ఇప్పుడు 80 ఏళ్లు పైనే ఉంటాయి.
కానీ, 64 ఏళ్ల కిందట వాళ్లకి జరగాల్సిన పెళ్లిని ఇన్నాళ్లకు గ్రాండ్‌గా చేసుకున్నారు.అప్పట్లో కుదరని పెళ్లిని ఇప్పుడు వాళ్ల మనవళ్లు, కుటుంబ సభ్యులు కలిసి ఎంతో ప్రేమగా జరిపించారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు కథలోకి వెళ్తే, 1960ల్లో కులాంతర వివాహాలంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు.అలాంటి రోజుల్లో జైన్ మతానికి చెందిన హర్ష్, బ్రాహ్మణ(Harsh, Brahmin) అమ్మాయి అయిన మృదు ఒకే స్కూల్‌లో చదువుకున్నారు.స్నేహం ప్రేమగా మారింది.
ఒకరికొకరు లెటర్లు రాసుకుంటూ ప్రేమలో మునిగిపోయారు.కానీ మృదు ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలిసి తిట్టారు, ఈ పెళ్లికి ఒప్పుకోమని తెగేసి చెప్పారు.
ఇంట్లో ఒప్పుకోరు అని తెలిసినా, హర్ష్, మృదు మాత్రం ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు.దీంతో ఇద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
సొంత వాళ్లకి దూరంగా, ఎన్నో కష్టాలు పడుతూ ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు.ప్రేమతో ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకున్నారు.
కాలం గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల మనసులు కూడా మారాయి.వాళ్ల ప్రేమ ముందు కరిగిపోయారు.హర్ష్, మృదులను మళ్లీ దగ్గరకు తీసుకున్నారు.వాళ్ల పిల్లలు, మనవళ్లు.తాతయ్య, అమ్మమ్మల ధైర్యం గురించి, వాళ్ల అచంచలమైన ప్రేమ గురించి ఎన్నో కథలు వింటూ పెరిగారు.ఇలాంటి అద్భుతమైన ప్రేమ ప్రయాణానికి గుర్తుగా, వాళ్ల మనవళ్లు 64వ పెళ్లి రోజున ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు.
తాతయ్య, అమ్మమ్మకి తెలియకుండా ఒక గ్రాండ్ వెడ్డింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు.పెళ్లి కోసం హర్ష్, మృదు ఇద్దరినీ కాసేపు వేరు వేరుగా ఉంచారు.
పెళ్లిలో అన్ని సాంప్రదాయ పద్ధతులు, ఆచారాలు చేశారు.యవ్వనంలో చేసుకోలేకపోయిన పెళ్లిని ఇప్పుడు అగ్నిసాక్షిగా జరిపించారు.
మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేశారు.ఒకరికొకరు తోడుగా ఉంటామని మాట ఇచ్చుకున్నారు.
ఈ వేడుక మొత్తం ఆనందంతో నిండిపోయింది.కుటుంబ సభ్యులు అందరూ వాళ్ల మీద ప్రేమను, దీవెనలు కురిపించారు.
హర్ష్, మృదుల ప్రేమ కథ నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చేలా ఉంది కదూ.