దానిమ్మ గింజల్లో ఉండే గుణాలు అధిక రక్తపోటు, అధిక కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి.ఒక దానిమ్మకాయలో సుమారుగా 600 గింజలు ఉంటాయి.
దానిమ్మకాయను గింజల రూపంలోనూ,జ్యుస్ రూపంలోనూ తీసుకోవచ్చు.దానిమ్మ శరీరం లోపల,బయట కూడా సానుకూల ప్రభావాలను చూపుతుంది.
దానిమ్మ గింజల్లో విటమిన్ బి, సి మరియు కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.దానిమ్మలో ఉండే విటమిన్ సి యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది.
అలాగే వ్యాధుల మీద పోరాటం చేయటానికి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
దానిమ్మలో ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన కీళ్లవాతాన్ని మరియు ఆర్థరైటిస్ ని తగ్గించటంలో సహాయపడుతుంది.
అందువల్ల కీళ్ల నొప్పులు ఉన్నవారు తరచుగా దానిమ్మకాయను తింటే మంచిది.
దానిమ్మలో ఉండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు క్యానర్ కారకాలు స్ప్రెడ్ అవ్వకుండా కాపాడటమే కాకుండా క్యాన్సర్ కణాలను చంపేస్తుంది.
పురుషుల్లో ఎక్కువగా వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరంలో మంచి కొలస్ట్రాల్ ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
చెడు కొలస్ట్రాల్ ని విచ్ఛిన్నం చేస్తుంది.
దానిమ్మలో ఉండే కొన్ని ఆమ్లాలు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి.
దానిమ్మలో ఉండే కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 డయాబెటిస్ ను నివారించటంలో సాయపడతాయి.
దానిమ్మ గింజలలో రక్తపోటు, మరియు మూడ్ పై ప్రభావం చూపే లక్షణాలు ఉంటాయి.
ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలను పెంచటం ద్వారా లైంగిక కోరికలను పెంచుతాయి.
దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి.
ఈ గింజలు నోటిలోని బ్యాక్టీరియాతో కూడా పోరాటం చేస్తాయి.
జీర్ణక్రియ బాగుండేలా చేస్తుంది.
దానిమ్మలో ఉండే బి- కాంప్లెక్స్ విటమిన్లు శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు మరియు కార్బొహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి సాయపడతాయి.దానిమ్మ గింజలలో ఉండే పీచు పదార్థం జీర్ణప్రక్రియకి బాగా సహాయపడుతుంది.
బరువు తగ్గటానికి బాగా సహాయపడుతుంది.దానిమ్మలో ఉండే పీచు పదార్ధం ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.దాంతో తొందరగా ఆకలి వేయదు.
దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా చేసి శరీరంలో ప్రవేశించే వైరస్,బ్యాక్టీరియా మీద పోరాటం చేస్తుంది.