సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పెళ్లి( Celebrities Marriages ) చేసుకుని ఒక ఇంటివారు అయితే అభిమానులు సైతం ఎంతో సంతోషిస్తారు.ఈ ఏడాది అలా పెళ్లి పీటలెక్కి అభిమానులకు సంతోషాన్ని మిగిల్చిన సెలబ్రిటీలు ఎక్కువమంది ఉన్నారు.
సెలబ్రిటీల వివాహ బంధానికి సంబంధించిన విశేషాలు అభిమానులకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కలిగి ఉన్న జోడీలలో నాగచైతన్య శోభిత( Nagachaitanya Sobhita ) జోడీ ఒకటని చెప్పవచ్చు.
అన్నపూర్ణ స్టూడియోలో చైతన్య శోభిత వివాహం గ్రాండ్ గా జరిగింది.ఈ వివాహం నాగచైతన్యకు రెండో వివాహం అనే సంగతి తెలిసిందే.ప్రేమించి పెద్దలను ఒప్పించి చైతన్య శోభిత పెళ్లి చేసుకున్నారు.చైతన్య శోభిత పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్( Rakul ) ఈ ఏడాది ఫిబ్రవరి నెల 21వ తేదీన పెళ్లి చేసుకున్నారు.ఆమె భర్త పేరు జాకీ భగ్నానీ కాగా ప్రస్తుతం పలు వ్యాపారాలతో రకుల్ బిజీగా ఉన్నారు.
కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును కలిగి ఉన్న సిద్దార్థ్ అదితిరావు హైదరీని( Siddharth Aditirao Hydari ) పెళ్లి చేసుకున్నారు.పెద్దగా హడావిడి లేకుండానే సిద్దార్థ్ పెళ్లి జరగడం గమనార్హం.కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్( Kiran Abbavaram Rahasya Gorak ) వివాహం గ్రాండ్ గా జరగగా కిరణ్ ఈ ఏడాది క సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.తాప్సీ పన్ను మథియాస్ బోయ్( Taapsee Pannu Mathias Boe ) ఈ ఏడాది పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ నికోలాయ్ సచ్ దేవ్, సుబ్బరాజు స్రవంతి, ఐశ్వర్యా అర్జున్ ఉమాపతి, మేఘా ఆకాశ్ సాయివిష్ణు, క్రిష్ ప్రీతి చల్లా, కీర్తి సురేష్ ఆంటోని, శ్రీ సింహా రాగ వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ద్వారా వార్తల్లో నిలిచారు.ఈ సెలబ్రిటీ జోడీలు కలకాలం అన్యోన్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.