శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్.. 5 లక్షల సాయం చేసిన డైరెక్టర్ వైఫ్!

పుష్ప 2( Pushpa 2 ) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్( Sandhya Theater ) తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించిన విషయం తెలిసిందే.ఈమె అక్కడికక్కడే మరణం పొందగా తన కుమారుడు శ్రీ తేజ్( Sree Tej ) తీవ్ర గాయాలు పాలయ్యారు.

 Director Sukumar Visit Kims Hospital For Sree Tej Details, Sukumar, Thabitha, Pu-TeluguStop.com

ఇలా శ్రీ తేజ్ ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.ఇక రేవతి మరణించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని( Allu Arjun ) పోలీసులు అరెస్ట్ చేశారు.

Telugu Allu Aravind, Allu Arjun, Kims, Pushpa, Revathi, Sandhya Theater, Sree Te

ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కావటాన్ని ఇండస్ట్రీ మొత్తం తీవ్రస్థాయిలో ఖండించింది.ఇకపోతే ఈ ఘటన జరిగిన రెండు రోజులకే అల్లు అర్జున్ ఈ ఘటన పై స్పందిస్తూ రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని అలాగే బాబు చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పినప్పటికీ ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్టు చేశారు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్  బెయిల్ మీద బయటకు వచ్చారు.

Telugu Allu Aravind, Allu Arjun, Kims, Pushpa, Revathi, Sandhya Theater, Sree Te

ఇక అల్లు అర్జున్ హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఈయనపై కేసు ఉన్న నేపథ్యంలో హాస్పిటల్ కి వెళ్లలేరు.అందుకే అల్లు అరవింద్( Allu Aravind ) ఇటీవల హాస్పిటల్ కి వెళ్లి ఆ చిన్నారిని పరామర్శించడమే కాకుండా తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు.ఇక తాజాగా పుష్ప డైరెక్టర్ సుకుమార్( Sukumar ) సైతం హాస్పిటల్ కి వెళ్లి చిన్నారి శ్రీ తేజ్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నారు.ఇకపోతే ఈ ఘటన తర్వాత డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత( Thabitha ) డిసెంబర్ 9వ తేదీన ఆ చిన్నారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆ చిన్నారీ  వైద్య‌, విద్యా, ఆర్థిక సాయం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube