ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ జాతర సీన్ మాత్రం ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పాలి చీర కట్టుకొని అల్లు అర్జున్ ఈ సన్నివేశంలో నటించే నటన అందరిని ఎంతగానో ఆకట్టుకుంది నిజంగానే అమ్మవారు తనలోకి వచ్చారా అనే విధంగా ఈయన ఎక్స్ప్రెషన్స్ కానీ తన నటన కానీ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది.
ఈ సన్నివేశాన్ని చూడటం కోసమే ఎంతోమంది థియేటర్ కి వెళుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు సైతం ఈ జాతర సీన్ పట్ల పొగడ్తల వర్షం కురిపించారు.ఈ సీన్ లో అల్లు అర్జున్ నటన అద్భుతమని కొనియాడారు.ఇక ఈ సీన్స్ చూసిన తర్వాత కొంతమందికి థియేటర్లోనే పూనకాలు వచ్చిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
అయితే తాజాగా ఈ సీన్ చూసిన తర్వాత ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ( Chandra Bose ) భార్య సుచిత్ర ( Suchitra ) ఏకంగా అల్లు అర్జున్ పాదాల వద్ద పడి నమస్కరించిందనీ తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చంద్ర బోస్ సినీ గేయ రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.ఇక ఈయన ఇటీవల రచించిన నాటు నాటు పాటకు కూడా ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసినదే.ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి భార్య అల్లు అర్జున్ నటనకు ఫిదా అవ్వడమే కాకుండా ఆయన పాదాల ముందు పడి నమస్కరించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.తన భర్త ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.
ఆయన ప్రతిభకు ఆస్కార్( Oscar ) కూడా వచ్చింది.అలాంటి వ్యక్తి భార్య ఇలా అల్లు అర్జున్ ముందు మోకాళ్ళ మీద పడి దండం పెట్టడం అంటే ఆయన సాధించిన ఘనత ఈ ఘటన ముందు తేలిపోవాల్సిందే.
ఇక ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ నటనకు తప్పనిసరిగా నేషనల్ అవార్డు వస్తుంది అంటూ కూడా పలువురు అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.