సాధారణంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఉండే వంట గదిలో తప్పకుండా వెల్లుల్లి( Garlic ) ఉంటుంది.ఇంకా చెప్పాలంటే వెల్లుల్లి, తేనెతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
దీన్ని ఎలా వాడాలి, ఎప్పుడు తీసుకోవాలని విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ రెండిటి కాంబినేషన్తో కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
వెల్లుల్లి, తేనె( Honey ) ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.ఈ రెండిటిని కలిపి ఉదయం వేళ పరిగడుపున తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వెల్లుల్లి, తేనె కాంబినేషన్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇలా ప్రతిరోజు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.ఇందులో యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.ఈ రెండిటి కాంబినేషన్ తో ఇమ్యూనిటీనీ ( Immunity ) పెంచుకోవచ్చు.
గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.అయితే రోజు పరిగడుపున తీసుకోవాల్సి ఉంటుంది.
వెల్లుల్లి, తేనె రెండిటినీ కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ తో పోరాడేందుకు ఉపయోగపడతాయి.అందుకే ప్రతిరోజు పరిగడుపున తీసుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ఈ రెండిటిలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.గుండె వ్యాధిగ్రస్తులకు ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే తేనె, వెల్లుల్లి మిశ్రమం రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.అలాగే రోజు తీసుకోవడం వల్ల మెటబోలిజం కూడా వేగవంతమవుతుంది.ఈ మిశ్రమంలోనీ పోషక గుణాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి.శరీరం అంతర్గత ఉష్ణోగ్రత పెంచడం వల్ల జలుబు, జ్వరం వంటి సమస్యలు దూరం అవుతాయి.అలాగే గొంతులో గరగర లేదా సైనాస్ సమస్య కూడా దూరం అవుతుంది.