వెల్లుల్లి పాయలు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి ఇళ్లల్లోనూ వీటిని వాడుతుంటారు.
ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండే వెల్లుల్లి వంటలకు మంచి ఫ్లేవర్‌ను అందిస్తాయి.పైగా వెల్లుల్లిలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, శక్తివంతమైన యాంటీ అక్సిడెంట్స్, విటమిన్ సి ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.
అందుకే వెల్లుల్లి ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.అయితే వెల్లుల్లిని తీసుకునే విధానం బట్టీ కూడా దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.
మరి లేటెందుకు వెల్లుల్లిని ఏ విధంగా తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో చూసేయండి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా టైమ్ నడుస్తున్న సంగతి తెలిసిందే నలువైపుల నుంచి ఎటాక్ చేస్తున్న కరోనా మమహ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉండాలి.
అందుకు వెల్లుల్లి గ్రేట్‌గా సహాయపడుతుంది.అయితే వెల్లుల్లిని డైరెక్ట్‌గా కాకుండా చక్కగా పొట్టు తీసి నేతిలో వేయించుకుని ప్రతి రోజు ఉదయాన్నే మూడు లేదా నాలుగు చప్పున తినాలి.
ఇలా చేస్తూ ఇమ్యూనిటీ పరవ్ సూపర్ ఫాస్ట్‌గా పెరుగుతుంది.
నేతిలో వేయించిన వెల్లుల్లిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు చర్మ ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది.
మొటిమలు, ముడతలు పోయి చర్మం యవ్వనంగా మెరుస్తుంది.అధిక రక్త పోటుతో బాధ పడే వారు కూడా నేతిలో వేయించిన వెల్లుల్లిని తీసుకుంటే రక్త పోటు స్థాయిలు అదుపులోకి వస్తాయి.
ఇక బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పొట్టు తీసిన రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని తేనెలో ముంచి తినాలి.ఇలా చేస్తే బరువు తగ్గడంతో పాటుగా మెదడు పని తీరు మెరుగు పడుతుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి.గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.మరియు ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.