క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారా..అయితే ఈ జాగ్ర‌త్త‌లు మీకే!

కంటికి క‌నిపించ‌కుండా ముప్పు  తిప్పలు పెడుతున్న‌ క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇప్ప‌టికే ఎంద‌రో ప్రాణాలు విడ‌వ‌గా.

 Precautions To Be Taken By Those Who Have Been Vaccinated Against Corona! Precau-TeluguStop.com

మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతూ నానా తిప్పలు ప‌డుతున్నారు.ఇక మ‌రోవైపు క‌రోనాను అరిక‌ట్టేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

ఇప్ప‌టికే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.ఇక‌ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో జ్వరం, నీరసం, కండరాల నొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి.

వ్యాక్సిన్‌ ప్రభావంతో శరీరంలో వేడి పెరిగి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.అయితే వీటిని అదిగ‌మించాలంటే వ్యాక్సిన్ తీసుకున్న‌ త‌ర్వాత ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్తలు పాటించాల్సి ఉంటుంది.

అవేంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.వ్యాక్సిన్ వేయించుకున్న వారు త‌ప్ప‌కుండా ఆహ‌రం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి.

ఫైబ‌ర్ ఫుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి .ఫైబ‌ర్ శరీరాన్ని రిలాక్స్‌డ్‌గా ఉంచడంతో పాటు ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతుంది.

వ్యాక్సిన్‌ తర్వాత సూప్స్‌ తీసుకోవాలి.కొబ్బరినీళ్లు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.డైట్‌లో ఆకు కూర‌లు ఉండేలా చూసుకోవాలి.ఆయిల్ ఫుడ్స్‌‌, జంక్ ఫుడ్స్‌కు, షుగ‌ర్‌తో త‌యారు చేసిన స్వీట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ద్యం సేవించ‌రాదు.మ‌ద్యం తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌ప‌డిపోతుంది.

వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ఒత్తిడి ద‌రి చేర‌కుండా చూసుకోవాలి.ఒత్తిడి పెరిగే కొద్ది ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

అలాగే వ్యాక్సిన్ త‌ర్వాత ఖ‌చ్చితంగా రోజుకు ఎనిమిది గంట‌లు నిద్రించాలి.లేదంటే తీవ్ర అల‌స‌ట‌, ఆందోళ‌న, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

అంతేకాదు, వ్యాక్సిన్ వేయించుకున్న వారు శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.అందుకోసం నీటిని అధికంగా తీసుకోవాలి.‌‌

.

Precautions To Be Taken By Those Who Have Been Vaccinated Against Corona! Precautions, Vaccinated People, Vaccination, Corona Virus, Covid-19, Latest News, Health Tips, Good Health, Health, Corona Vaccine Tips, Fiber Rich Foods, Soups, Butter Milk, Fruit Juices, Hydrate - Telugu Butter Milk, Coronavaccine, Coronavirus, Covid, Fruit, Tips, Hydrate, Latest, Soups

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube