మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా.. క్లియర్ స్కిన్ కోసం ఇవి ట్రై చేయండి!

మొటిమలు, మచ్చలు( Acne, scars ) అత్యంత కామన్ గా వేధించే చర్మ సమస్యలు.మొటిమలు, మచ్చలు అందాన్ని ఎంతలా పాడుచేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 Try These Home Remedies To Get Rid Of Acne And Dark Spots! Acne, Dark Spots, Lat-TeluguStop.com

అందుకే వీటికి వీలైనంతవరకు దూరంగా ఉండాలని చాలా మంది భావిస్తుంటారు.కానీ ఎంత ప్రయత్నించినా చర్మం పై మొటిమలో లేక మచ్చలో ఏర్పడుతూనే ఉంటాయి.

అయితే మొటిమలు మరియు మచ్చలకు చెక్ పెట్టి క్లియర్ స్కిన్ ను అందించేందుకు కొన్ని ఇంటి చిట్కాలు సూపర్ గా సహాయపడతాయి.అటువంటి రెండు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Clear Skin, Dark Spots, Latest, Skin Care, Skin Care Tips, Ridacne-

రెమెడీ 1: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ జాజికాయ పొడి( Nutmeg powder ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ) మరియు వన్ టీ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళల్లోకి పోకుండా జాగ్రత్తగా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

మొటిమల సమస్యను వదిలించేందుకు ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది.వారానికి మూడుసార్లు ఈ రెమెడీని కనుక పాటించారంటే మొటిమల్లేని మెరిసే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.

Telugu Tips, Clear Skin, Dark Spots, Latest, Skin Care, Skin Care Tips, Ridacne-

రెమెడీ 2: ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic turmeric ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.నల్ల మచ్చల నివారణకు ఈ రెమెడీ సూపర్ గా పనిచేస్తుంది.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై మ‌చ్చ‌ల‌న్ని మాయమవుతాయి.

చర్మం అందంగా, ప్రకాశమంతంగా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube