మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో వెల్లుల్లి లేకుండా ఎటువంటి వంటకాన్ని కూడా చేయరు.ప్రతి ఒక్కరూ కూరల్లో వెల్లుల్లి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఎంతో రక్షిస్తుంది.ఇంకా చెప్పాలంటే చలికాలంలో వెల్లుల్లి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చలికాలంలో చాలామంది ప్రజలను జలుబు ఫ్లూ జ్వరాలు లాంటి సీజనల్ వ్యాధులు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి.ఇటువంటి కీలక సమయంలో రోగనిరోధక శక్తిని కాపాడుకునేందుకు మనల్ని మనం వ్యాధుల నుంచి రక్షించేందుకు వెల్లుల్లి ని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది.
అందుకే ఇలాంటి జలుబు లను తగ్గించుకోవడానికి ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది.
అయితే వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, పుష్కలంగా ఉంటాయి.
పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో వెల్లుల్లి నీ ఔషధాలలో ఉపయోగిస్తూనే ఉన్నారు.డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తరచుగా దీన్ని తినిపించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఏ కాలంలో అయినా వచ్చే రోగాలను దూరం చేస్తాయి.వెల్లుల్లిలోని గుణాలు శరీరంలో రక్త సరఫరా బాగా జరిగేలా చేస్తాయి.
చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చెప్పాలంటే వెల్లుల్లి అధిక బరువు తగ్గడానికి కూడా ఎంత బాగా ఉపయోగపడుతుంది.జలుబు, దగ్గు నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.శ్వాస కోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.
అధిక రక్తపోటు కూడా తగ్గించడంలో వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది.చెడు కొలెస్ట్రాల్ను కూడా వెల్లుల్లి ఎంతగానో తగ్గిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది.వెల్లుల్లి నమలడం వల్ల జలుబు, ప్లు వంటి వైరస్ లతో తెల్ల రక్త కణాలు మన శరీరంలో పెరుగుతాయి.
కండరాల వాపు, గొంతు నొప్పి తగ్గిస్తుంది
.