జమున, జయలలిత, ఇద్దరూ పేరుమోసిన నటీమణులే.ఇద్దరూ ఎన్నో అద్భుత సినిమాల్లో నటించారు.ఇద్దరికీ ఎంతో మంది అభిమానులున్నారు.వీరిద్దరికీ ఉన్న మరో కామన్ పాయింట్ ఆత్మాభిమానం.తమ ఆత్మాభిమానానికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోరు.ఈ కారణంగానే పలువురు అగ్రహీరోలతో సైతం సినిమాలు చేసేందుకు ఒప్పుకోలేదు.
జమున.ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారి సినిమాలకు సైతం ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది ఈ అగ్రతారామణి.
కొంత కాలం పాటు ఈ ఇద్దరి సినిమాల్లో నటించలేదు కూడా.ఒకానొక సమయంలో జయలలితకు, జమునకు మధ్య పంచాయితీ వచ్చింది.
ఇంతకీ వీరి మధ్య వచ్చిన గొడవకు అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జమున, జయలలిత కలిసి 1971లో శ్రీకృష్ణ విజయం అనే సినిమాలో నటించారు.
కమలాకర కామేశ్వర్ రావు దర్శకత్వం వహించారు.ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించాడు.
అంటే శ్రీకృష్ణుడిగా యాక్ట్ చేశాడు.వసుంధర పాత్రలో జయలలిత, సత్యభామ పాత్రలో జమున నటించారు.
కౌముది ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను మల్లెమాల సుందరరామిరెడ్డి నిర్మించాడు.ఒకరోజు జయలలిత, జమునకు డైరెక్టర్ రిహార్సల్స్ చేయించాడు.
తొలుత జయలలిత డైలాగ్ చెబితే, తర్వాత దానికి సమాధానంగా జమున డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది.అందుకే డైలాగ్ చెప్పాలని జమును జయలలితకు చెప్పింది.నేనెందుకు చెప్పాలి? మీరే చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.దీంతో జమునకు బాగా కోపం వచ్చింది.
వెంటనే దర్శకుడికి విషయం చెప్పింది.ఏంటండీ ఆ అమ్మాయి డైలాగ్ చెప్పకపోతే.నేను ఎలా రీహార్సల్స్ చేయాలి? ఆమె చెప్పాలి కదా? అని అడిగింది.ఆయన మౌనంగా ఉన్నాడు.
దీంతో జమునకు మరింత కోపం వచ్చింది.వెంటనే మేకప్ రూంలోకి వెళ్లింది.
జయలలిత అక్కడే కూర్చుంది.దర్శకనిర్మాతలు జమున దగ్గరికి వచ్చారు.ఆమెకు సర్ది చెప్పి మళ్లీ సీన్ లోకి తీసుకెళ్లారు.ఆ తర్వాత జయలలిత, జమున అత్యంత మిత్రులు కావడం విశేషం.