కరోనా వైరస్.ఎప్పుడు, ఎలా, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.
గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైరస్.అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలు కమ్మేసింది.
ఈ క్రమంలోనే కరోనా కాటుకు లక్షల మంది బలైపోయారు.మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు కూడా 1.70 లక్షలు దాటేసింది.
ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు.
ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో.మానవ మనుగడకే కరోనా పెద్ద గండంగా మారింది.ఇదిలా ఉంటే.కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు.
ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

అయితే ఎప్పుడు బయట స్వేచ్ఛగా తిరిగే ప్రజలు.కరోనా దెబ్బకు ఇంట్లోనే బందీ అవ్వడంతో మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారట.ఈ మానసిక ఒత్తిడి శృంగార జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తాజా సర్వేలో తేలింది.
వాస్తవానికి మనిషిని ఒత్తిడి నుంచి బయటపడేసేది శృంగారమే.ఎందుకంటే ఆ సమయంలో రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్ హార్మోన్ మనిషిలో ఉన్న ఒత్తిడిని దూరం చేస్తుంది.
కానీ, ఇప్పుడు కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న ప్రజలు శృంగారంపై ఆసక్తిని కోల్పోతున్నారని నిపుణులు గుర్తించారు.అలాగే ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల భార్యభర్తల మధ్య సఖ్యత కూడా లోపిస్తుందని.
తాజా సర్వేలు చెబుతున్నాయి.ఏదేమైనా కరోనా మనిషిని ఈ విధంగా కూడా దెబ్బ తీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.