ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయా..

ఉప్పు ( Salt )ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, పక్షవాతం, కడుపులో క్యాన్సర్, కిడ్నీలో రాళ్లు,ఎముకలు పటుత్వం కోల్పోవడం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.కొన్ని సందర్భాలలో అకాల మరణాలు సంభవించే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 Are There So Many Health Problems If You Eat Too Much Salt ,health Problems,salt-TeluguStop.com

సోడియం వినియోగాన్ని నియంత్రించేందుకు భారతదేశం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టిందని వైద్యులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ( World Health Organization ) ప్రచురించిన జాబితాలో భారతదేశం ఎల్లో లిస్టులో ఉందని వెల్లడించారు.

అంటే సోడియం వినియోగాన్ని తగ్గించుకోవడానికి చర్యలు మొదలుపెట్టారు.భారత్ ప్రభుత్వం ఈట్ రైట్ అనే కార్యక్రమం ద్వారా ఆహారంలో ఉప్పు, పంచదార( sugar ) తగ్గించే దిశలో అవగాహన చేపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

అలాగే చెడు కొవ్వు తగ్గించడం కూడా ఇందులో భాగమని వెల్లడించారు.

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి స్థానికంగా లభించే ఆహార పదార్థాలను కాలానుగుణంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా అల్లం, వెల్లుల్లి, ఉల్లి, దాల్చిన చెక్క నిమ్మకాయలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.ఇవి ఆహారంలో ఉప్పు అవసరాన్ని తగ్గించగలవు.

ఊరగాయలు, సాల్టెడ్ వేరుశెనగలు, మోనోసోడియం గ్లుటామేట్ ఉన్న పదార్థాలు, జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం మానేయడమే మంచిది.

మనకు రోజు వారికోట నాలుగు గ్రాముల ఉప్పు, జంక్ ఫుడ్ లేదా ఇన్‌స్టాంట్ ఫుడ్ తింటే వెంటనే నాలుగు గ్రాములు చేరిపోతాయి.ఇంకా మిగిలినదంతా అనవసరం.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గిస్తే సగం సమస్య తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.

వీలైనంత ఎక్కువ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.అంతే కానీ ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకుని ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube