Hair Fall Home Remedy : హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీని పాటిస్తే అడ్డుకట్ట పడాల్సిందే!

హెయిర్ ఫాల్.సాధారణంగా కొందరిలో ఈ సమస్య చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది.

 A Powerful Home Remedy To Reduce Hair Fall Naturally, Home Remedy, Hair Fall, St-TeluguStop.com

ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, పోషకాల కొరత, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందులు వాడటం తదితర అంశాలు ఇందుకు కారణాలుగా నిలుస్తుంటాయి.అయితే కారణం ఏదైన‌ప్పటికీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్‌ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డుకట్ట పడాల్సిందే.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ వేసి కనీసం ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న వాటర్ ను స్ప్రే చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Remedy, Latest, Thick, Thin-Telugu Health Tips

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.దాంతో హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా మదన పడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube