కొన్ని కొన్ని సార్లు నెటిజెన్స్ ప్రతి చిన్న విషయాన్ని టార్గెట్ చేస్తూ పెద్దదిగా చేస్తూ ఉంటారు.అలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ వాళ్ళు చేసే కామెంట్లు మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంటుంది.
చాలా వరకు హీరోయిన్స్ ను ఉద్దేశించి మాత్రం బాగా ట్రోల్స్ చేస్తుంటారు.ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లను రకరకాలుగా ట్రోల్స్ చేశారు.
తాజాగా జబర్దస్త్ వర్ష పై కూడా బాగా ట్రోల్స్ చేసారు.ఇంతకు అసలేం జరిగిందంటే.
టాలీవుడ్ బుల్లితెర ఆర్టిస్ట్ జబర్దస్త్ వర్ష గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తొలిసారిగా బుల్లితెరపై పలు సీరియల్ లలో నటించింది వర్ష.దీంతో కొంతవరకు మాత్రమే ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిందో ఇక అప్పటినుంచి జబర్దస్త్ లో కమెడియన్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
దీంతో ఆమెకు జబర్దస్త్ ద్వారా మరింత పరిచయం పెరిగింది.ఇక అందులో మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
అతనితో ప్రేమించిన అమ్మాయిగా ప్రవర్తిస్తుంది.నిజానికి వీళ్ళ ప్రవర్తన చూస్తే బాగా మితిమీరి ఉంటుంది.
ఇక ఈ షో లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా సందడి చేస్తుంది వర్ష.

అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్లలో పాల్గొంటే.తన డాన్సులతో, అల్లర్లతో తెగ రచ్చ చేస్తుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఎంతలా అంటే ఈమె చేసే గ్లామర్ షో కింద ఏ హీరోయిన్ కూడా పనికిరాదు అన్నట్లుగా చేస్తుంది.నిజానికి వర్ష చేసే గ్లామర్ షో మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు.

తన అందాలతో కుర్రాళ్లను తన వైపు లాక్కుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి రచ్చ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని ఇన్ స్టా వేదికగా పంచుకుంది.
అందులో తన అందాలతో బాగా ఫిదా చేసింది.పైగా ట్రెడిషనల్ లుక్ లో ఉండటంతో ఆ ఫోటోలకు బాగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
ఒక నాలుగు ఫోటోలు పంచుకోగా అందులో రెండు ఫోటోలు ఒకేలా ఉన్నాయి.దీంతో ఓ నెటిజన్ తాగినావా అంటూ రెండుసార్లు ఫోటో పంచుకున్నావు అంటూ సరదాగా కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.
ఇక వర్ష ఇప్పటివరకు వెండితెరపై అడుగుపెట్టలేదు కానీ ప్రస్తుతం వెండితెరపై అవకాశాల కోసం గ్లామర్ షో కూడా చేస్తుంది.భవిష్యత్తులోనైనా ఈమెకు సినిమాలలో అవకాశాలు వస్తాయో లేవో కానీ వస్తే మాత్రం ఈ బ్యూటీ కి మరింత హోదా అందడం ఖాయం.







